నెవర్ బిఫోర్ అనేలా తండేల్ సాంగ్
నాగ చైతన్య(Naga Chaitanya), సాయి పల్లవి(Sai Pallavi) హీరోహీరోయిన్లుగా నటిస్తున్న పాన్ ఇండియా సినిమా తండేల్(Thandel). చందూ మొండేటి(Chandoo Mondeti) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను బన్నీ వాసు(Bunny Vaasu) భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. ఎన్నో అంచనాల మధ్య రూపొందుతున్న ఈ సినిమా కోసం ఆడియన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో శివరాత్రి సాంగ్ కోసం తండేల్ టీమ్ స్పెషల్ ప్లాన్ వేసింది.
శ్రీ ముక్కాళింగేశ్వర స్వామి ఆలయంలో జరిగే మహా శివరాత్రి ఉత్సవాలను స్పూర్తిగా తీసుకుని దాదాపు వెయ్యి మందికి పైగా డ్యాన్సర్లతో ఎంతో అద్భుతవంగా సాంగ్ ను తెరకెక్కించారు. శివరాత్రి పాటలో నందికేశ్వరుడికి జరిగే భజనలు, శివ పార్వతుల ఆరాధనను గొప్ప నేపథ్య సంగీతంతో తెరపై ఆవిష్కరించారని తెలుస్తోంది.
దేవీ శ్రీ ప్రసాద్(Devi Sri Prasad) స్వరపరిచిన ఈ పాట మంచి క్లాసిక్ గా నిలవనుందని చిత్ర యూనిట్ భావిస్తోంది. శేఖర్ మాస్టర్(Shekar Master) కొరియోగ్రఫీ వహించిన ఈ సాంగ్, చైతూ(Chaitu)కు కెరీర్ బెస్ట్ గా నిలుస్తుందంటున్నారు. ముఖ్యంగా శివుడి విగ్రహం ముందు పురాతన ఆలయంలో తీసిన సీన్స్ ఆడియన్స్ ను మంత్రముగ్ధుల్ని చేస్తాయంటున్నారు. తండేల్ తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది. మరి బాక్సాఫీస్ వద్ద తండేల్ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.













