తండేల్ రిలీజ్ పై క్లారిటీ వచ్చేది ఆ రోజే
నాగ చైతన్య(Naga Chaitanya) హీరోగా చందూ మొండేటి(Chandoo Mondeti) దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమా తండేల్(Thandel). గీతా ఆర్ట్స్2(Geetha Arts2) బ్యానర్ లో అల్లు అరవింద్(Allu Aravind) సమర్పణలో బన్నీ వాస్(Bunny Vas) ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. చైతూ కెరీర్లోనే హయ్యెస్ట్ బడ్జెట్ మూవీగా రూపొందుతున్న ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయాలని మేకర్స్ అనుకుంటున్నారు.
కానీ అదే టైమ్ కు అల్లు అరవింద్ మేనల్లుడు రామ్ చరణ్(Ram Charan) గేమ్ ఛేంజర్(Game Changer) రిలీజవుతుంది. నాగచైతన్య మేనమామ వెంకటేష్(Venkatesh) సంక్రాంతికి వస్తున్నాం(Sankrantiki Vasthunnam) రిలీజ్ అవుతుంది. అందుకే ఈ సినిమా వాయిదా పడే ఛాన్సుందంటున్నారు. సినిమా రిలీజ్ కు మెయిన్ బ్రేక్ ఈ కమిట్మెంట్సేనని డైరెక్టర్ చందూ మొండేటి ఇప్పటికే క్లారిటీ ఇచ్చాడు.
ఇదిలా ఉంటే తండేల్ మూవీ రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇవ్వడానికి చిత్ర యూనిట్ నవంబర్ 4న మీడియా మీట్ నిర్వహించనున్నట్లు సమాచారం. ఆ రోజే సినిమాను ఎప్పుడు రిలీజ్ చేస్తారనే ప్రశ్నకు క్లారిటీ రానుంది. అయితే తండేల్ ను జనవరి 25కి వాయిదా వేద్దామా అని మేకర్స్ ఆలోచిస్తున్నారట. తండేల్ కోసం మంచి ప్రైమ్ డేట్ ను చూస్తున్నారట. మరి చిత్ర యూనిట్ రిలీజ్ డేట్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.













