ఆ విషయంలో తండేల్ జాగ్రత్త పడాల్సిందే!
నాగచైతన్య- సాయి పల్లవి జంటగా రూపొందుతున్న సినిమా తండేల్. చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. రీసెంట్ గా రిలీజైన గ్లింప్స్ కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. కొంత భాగం షూటింగ్ నుంచే ఈ రేంజ్ విజువల్స్ ను కట్ చేయడంతో అందరికీ మరోసారి చందూ మొండేటి ప్రతిభ అర్థమైంది.
బిజినెస్ పరంగా ఆలోచించకుండా తండేల్ కోసం నిర్మాతలు బాగానే ఖర్చు పెడుతున్నట్లు తెలుస్తోంది. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఒక విషయంలో జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రస్తుతం బాలీవుడ్ లో యాంటీ పాకిస్తాన్ సెంటిమెంట్ వర్కవుట్ అవడం లేదు. తండేల్ సినిమాలో యాంటీ పాకిస్తాన్ సెంటిమెంట్ ఉంటుందని గ్లింప్స్ చూస్తే అర్థమవుతుంది.
తండేల్ సినిమాలో హీరో పాక్ జైల్లీ బందీ అవడం, తప్పించుకోవడం, అక్కడి ఆఫీసర్లకు సవాల్ విసరడం ఉంటుంది. ఈ సీక్వెన్స్ ను చందూ ఎలా తెలివిగా హ్యాండిల్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను ఈ ఏడాదే రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. కానీ రిలీజ్ ఎప్పుడనేది మాత్రం ఇంకా ఫిక్స్ అవలేదు.













