రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసే పనిలో తండేల్ మేకర్స్
నాగ చైతన్య కెరీర్లోనే హయ్యెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా తండేల్. చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. లవ్ స్టోరీ తర్వాత చైతూ- సాయి పల్లవి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.
శ్రీకాకుళం, పాకిస్తాన్ మధ్య బంగాళాఖాతం నేపథ్యంలో మత్య్సకార కమ్యూనిటీలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా ఈ కథను రూపొందించారు. ఈ సినిమా స్క్రిప్ట్ పై చాలా కాలం పని చేయడం, చాలా రోజులు వర్క్ షాప్ చేయడం వల్ల ఈ సినిమాను అద్భుతమైన విజువలైజేషన్ తో చందూ మొండేటి తీర్చి దిద్దుతున్నాడు.
ఈ సినిమా రిలీజ్ గురించి గీతా ఆర్ట్స్ ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. పాన్ ఇండియా రిలీజ్ కాబట్టి కరెక్ట్ రిలీజ్ డేట్ ను సెట్ చేసే పనిలో మేకర్స్ ఉన్నారట. ఆగస్ట్ లేదా సెప్టెంబర్ లో తండేల్ ను రిలీజ్ చేయాలని అనుకుంటున్నారట. సినిమాకు ముందుగా వర్క్ షాప్స్ నిర్వహించడం వల్ల షూటింగ్ ఎలాంటి గ్యాప్ లేకుండా చకచకా పూర్తవుతుంది. బాక్సాఫీస్ వద్ద ఎలాంటి క్లాష్ లేకుండా రిలీజ్ చేసి అన్ని భాషల్లో మంచి కలెక్షన్లు సాధించాలని చూస్తున్నారట.













