Thammudu: కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న తమ్ముడు
ఎన్నో ఆశలు పెట్టుకుని నితిన్(nithin) చేసిన రాబిన్హుడ్(robinhood) సినిమా అతన్ని బాగా నిరాశ పరిచింది. దీంతో నితిన్ ఇప్పుడు తన ఆశలన్నింటినీ తమ్ముడు సినిమాపైనే పెట్టుకున్నాడు. వేణు శ్రీరామ్(venu sriram) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను దిల్ రాజు(dil raju) తన బ్యానర్లో నిర్మించాడు. వాస్తవానికి తమ్ముడు(thammudu) సినిమా ఫిబ్రవరిలోనే రావాల్సింది కానీ రాబిన్హుడ్ వల్ల తమ్ముడు పలు వాయిదాలు పడింది.
పలు వాయిదాలు పడిన తమ్ముడు సినిమా ఇప్పుడు రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకున్నట్టు తెలుస్తోంది. జులై 4న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని దిల్ రాజు ప్లాన్ చేస్తున్నాడట. ఇంకా దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇవాళో రేపో దీనిపై అనౌన్స్మెంట్ వచ్చే ఛాన్సుంది. అయితే జులై 4ని దిల్ రాజు సెలెక్ట్ చేసుకోవడం వెనుక ఎన్నో కారణాలున్నాయి.
ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద పోటీ ఎక్కువ ఉండటం ఒక రీజనైతే, ఆల్రెడీ రాబిన్హుడ్ తో ప్రేక్షకుల ముందుకొచ్చి నిరాశ చెందిన నితిన్, ఇప్పుడు వెంటనే మరోసారి వస్తే ఆ సినిమాకు ఓపెనింగ్స్ పరంగా ఇబ్బందులు ఎదురయ్యే ఛాన్సుంది. అందుకే కొంచెం గ్యాప్ తీసుకుని తమ్ముడుకు భారీ రేంజ్ లో ప్రమోషన్స్ నిర్వహించి ఆ తర్వాత సినిమాను రిలీజ్ చేస్తే మంచి ఓపెనింగ్స్ దక్కుతాయని దిల్ రాజు ప్లాన్ చేశాడట. తెలివైన ఆలోచనే మరి.






