Thammudu: బ్రేక్ తీసుకోకుండా కష్టపడుతున్న తమ్ముడు
గత కొన్ని సినిమాలుగా సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్న టాలీవుడ్ యంగ్ హీరో నితిన్(Nithin) ఈ ఏడాది ఎలాగైనా గట్టి హిట్ కొట్టాలని చూస్తున్నాడు. ప్రస్తుతం వెంకీ కుడుముల(Venky Kudumula) దర్శకత్వంలో రాబిన్ హుడ్(Robinhood), వేణు శ్రీరామ్(Venu Sriram) దర్శకత్వంలో తమ్ముడు(Thammudu) అనే సినిమాలను రెడీకి రిలీజ్ చేస్తున్నాడు నితిన్. తమ్ముడు షూటింగ్ ఆఖరి దశలో ఉంది.
సంక్రాంతికి పండక్కి కూడా షూటింగ్ కు బ్రేక్ ఇవ్వకుండా తమ్ముడు షూటింగ్ ను చేసినట్టు చిత్ర యూనిట్ అప్డేట్ ఇచ్చింది. ప్రస్తుతం క్లైమాక్స్ సీన్స్ ను తెరకెక్కిస్తున్నారట. నితిన్ తో పాటూ కీలక నటీనటులంతా ఆ షూటింగ్ లో పాల్గొంటున్నారని సమాచారం. రీసెంట్ గా చింతల్ లో హై ఓల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ ను తమ్ముడు చిత్ర యూనిట్ పూర్తి చేసిందట.
ఈ సినిమాను మంచి క్వాలిటీతో కుదిరినంత త్వరగా పూర్తి చేయాలని డైరెక్టర్ వేణు శ్రీరామ్ చూస్తున్నాడు. అక్కా తమ్ముడు సెంటిమెంట్ నేపథ్యంలో రూపొదుతున్న ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు మర్చిపోలేని సినిమాటిక్ ఎక్స్పీరియెన్స్ ను మిగులుస్తుందని చిత్ర యూనిట్ వర్గాలు చెప్తున్నాయి. మామలూగా అయితే ఈ సినిమాను శివరాత్రికి రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేశారు. మరి ఇప్పుడేమైనా రిలీజ్ డేట్ మారుతుందేమో చూడాలి.













