Thammudu: తమ్ముడు నుంచి క్రియేటివ్ వీడియోను రిలీజ్ చేసిన టీమ్
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్(Nithin) గత కొన్ని సినిమాలుగా వరుస ఫ్లాపులు అందుకుంటున్నాడు. ఎన్నో ఆశలతో రాబిన్‌హుడ్(Robinhood) సినిమా చేస్తే అది కూడా ఫ్లాపైంది. దీంతో ఇప్పుడు నితిన్ తన ఆశలన్నింటినీ తన తర్వాతి సినిమా తమ్ముడు పైనే పెట్టుకున్నాడు. ఓ మై ఫ్రెండ్(Oh My Friend), ఎంసీఏ(MCA), వకీల్‌సాబ్(Vakeelsaab) డైరెక్టర్ వేణు శ్రీరామ్(Venu Sri Ram) తమ్ముడు(Thammudu) సినిమాకు దర్శకత్వం వహించాడు.
తమ్ముడు సినిమా రెండేళ్లకు ముందే మొదలైంది. షూటింగ్ కూడా ఎప్పుడో మొదలైంది. కానీ అనుకోని కారణాల వల్ల ఆ సినిమా షూటింగ్ పోస్ట్‌పోన్ అవుతూ వస్తుంది. దీంతో అసలు తమ్ముడు ఎప్పుడు రిలీజవుతుందా అని తెలుసుకోవడానికి అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇలాంటి టైమ్ లో డైరెక్టర్ వేణు శ్రీ రామ్ బర్త్ డే సందర్భంగా మేకర్స్ ఓ క్రియేటివ్ వీడియోను రిలీజ్ చేస్తూ అందులో రిలీజ్ డేట్ గురించి అప్డేట్ ఇచ్చారు.
ఈ వీడియోలో సినిమాలో నటించిన మెయిన్ క్యాస్టింగ్ అంతా ఉంది. వర్ష బొల్లమ్మ(Varsha Bollamma), సప్తమి గౌడ(Saptami Gowda), స్వసిక(Swasika), లయ(Laya) అందరూ ఈ వీడియోలో కనిపించి డైరెక్టర్ వేణు శ్రీరామ్ ను రిలీజ్ ఎప్పుడని అడుగుతూ ఉండగా, ఆఖరికి చిత్ర నిర్మాత దిల్ రాజు తమ్ముడు సినిమాను జులై 4న రిలీజ్ చేయనున్న విషయాన్ని అనౌన్స్ చేశాడు. దిల్ రాజు(Dil Raju) ఈ వీడియోను ప్లాన్ చేసి తమ్ముడు రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసిన విధానం అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది.






