MSG: చిరూ మూవీలో స్పెషల్ సాంగ్ హీరోయిన్ ఆమెతోనేనా?
టాలీవుడ్ లో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్టుల్లో మన శంకరవరప్రసాద్ గారు(Mana Shankaravaraprasad Garu) కూడా ఒకటి. చిరంజీవి(chiranjeevi) హీరోగా అనిల్ రావిపూడి(anil ravipudi) దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతుంది. గత కొన్నాళ్లుగా ఫ్లాపులతో సతమతమవుతున్న చిరూ ఈ సారి ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ తో ఆడియన్స్ ముందుకు రానున్నాడు. అనిల్ టైమింగ్స్ కు చిరూ స్క్రీన్ ప్రెజెన్స్ కలిస్తే ఎలా ఉంటుందో చూడ్డానికి అందరూ ఆతృతగా ఉన్నారు.
భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నయనతార(nayanathara) హీరోయిన్ గా నటిస్తుంది. వెంకటేష్(venkatesh) ఈ మూవీలో కీలక పాత్ర చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ మూవీపై ఉన్న హైప్ ను దృష్టిలో ఉంచుకుని అనిల్ రావిపూడి సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ను ప్లాన్ చేశాడని, ఓ స్టార్ హీరోయిన్ తో ఆ సాంగ్ ను చేయిస్తాడని రీసెంట్ గా వార్తలొచ్చిన సంగతి తెలిసిందే.
కాగా ఇప్పుడా స్పెషల్ సాంగ్ పై అప్డేట్ వినిపిస్తోంది. మన శంకరవరప్రసాద్ గారు లోని స్పెషల్ సాంగ్ కోసం తమన్నా(tamannaah)ను తీసుకోవాలని మేకర్స్ భావిస్తున్నారని, స్పెషల్ సాంగ్స్ విషయంలో తమన్నాకు ప్రత్యేక డిమాండ్ ఉండటంతో ఆమె అయితే ఈ సాంగ్ కు రీచ్ ఎక్కువగా ఉండటంతో పాటూ భారీ క్రేజ్ ఏర్పడుతుందని అనిల్ డిసైడయ్యాడట. అయితే ఈ వార్తల్లో క్లారిటీ రావాల్సి ఉంది. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ కానుంది.







