తమన్ నోట పుష్ప2
గత కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా పుష్ప2(Pushpa2) గురించే చర్చ నడుస్తోంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న టైమ్ లో ఎవరూ ఊహించని విధంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాధ్యతల్ని దేవీ శ్రీ(Devi Sri Prasad) నుంచి తీసుకుని ఆ పనిని వేరే మ్యూజిక్ డైరెక్టర్ కు అప్పగించినట్లు వార్తలు రావడంతో అందరూ షాకయ్యారు. అయితే ఈ విషయంలో టీమ్ నుంచి మాత్రం ఎలాంటి సమాచారం వచ్చింది లేదు. దేవీ ప్లేస్ లో బీజీఎం బాధ్యతలు ఎవరు తీసుకున్నారనే విషయంలో క్లారిటీ లోపించింది. కొందరేమో ఆ బాధ్యతల్ని తమన్(Thaman) కు అప్పగించారంటుంటే, మరికొందరు తనతో పాటూ అజనీష్ లోక్నాథ్(Ajaneesh Loknath), సామ్ సీఎస్(Sam CS)కు కూడా ఇచ్చారని, ఎవరికి వారే వేర్వేరుగా పని చేస్తున్నారని, ఎవరి అవుట్పుట్ బావుంటే వాళ్లది తీసుకుంటారని కూడా ప్రచారం నడుస్తోంది.
అయితే మిగిలిన వారి సంగతి పక్కన పెడితే పుష్ప2 కోసం తమన్ పని చేస్తున్న మాట నిజమేనని తేలిపోయింది. ఈ విషయాన్ని స్వయంగా తమనే కన్ఫర్మ్ చేశాడు. తాజాగా హైదరాబాద్లో జరిగిన సింగర్ కార్తీక్(Singer Karthik) మ్యూజికల్ కాన్సర్ట్ లో పాల్గొన్న తమన్ We have pushpa-2. Waiting అని అన్నాడు. దీంతో తమన్ పుష్ప2 కు పని చేస్తున్న మాట నిజమేనని తేలింది.













