టిల్లూ స్వ్కేర్ నుంచి తమన్ అవుట్?
టాలీవుడ్ ఆడియన్స్ ఇప్పుడు ఎంతో ఇంట్రెస్టింగ్ గా వెయిట్ చేస్తున్న సినిమా టిల్లూ స్వ్కేర్. రెండేళ్ల కింద వచ్చిన డీజే టిల్లూకు సీక్వెల్ గా తెరకెక్కుతుంది ఈ సినిమా. డీజే టిల్లూ తర్వాత సిద్దూకి చాలా ఆఫర్లొచ్చినప్పటికీ ఏవీ ఓకే చేయకుండా మరోసారి టిల్లూ క్యారెక్టర్ తో అల్లరి చేయాలని డిసైడ్ ఈ సినిమా చేశాడు.
మార్చి 29న రిలీజ్ కానున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజైన టీజర్, పాటలు, ట్రైలర్ కు క్రేజీ రెస్పాన్స్ వస్తోంది. మరో 10 రోజుల్లో రిలీజ్ కానున్న ఈ సినిమాకు సంబంధించిన మరో ట్రైలర్ ను కూడా రిలీజ్ చేయాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన టెక్నీషియన్స్ లో చివరి దశలో కీలక మార్పు జరిగినట్లు సమాచారం.
డీజే టిల్లూ సినిమాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో అదరగొట్టిన తమన్, ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు కూడా ముందు బీజీఎం బాధ్యతలు తమన్ కే అప్పగించారు కానీ ఇప్పుడు మాత్రం తమన్ రీరికార్డింగ్ వర్క్ చేయడం లేదని సమాచారం. తమన్ ప్లేస్ లోకి భీమ్స్ సిసిరోలియో వచ్చినట్లు తెలుస్తోంది. ఈ సినిమా నుంచి తమన్ తప్పుకోవడానికి గల కారణం ఏంటన్నది మాత్రం ఇంకా బయటకు రాలేదు.













