Thaman: రాజా సాబ్ కోసం ఫ్రెష్ గా స్టార్ట్ చేసిన తమన్
ప్రభాస్(Prabhas) హీరోగా మారుతి(Maruthi) దర్శకత్వంలో వస్తోన్న భారీ పాన్ ఇండియన్ మూవీ ది రాజా సాబ్(The Raja Saab). హార్రర్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో మాళవిక మోహనన్(Malavika Mohanan), నిధి అగర్వాల్(Niddhhi Agerwal), రిద్ధి కుమార్(Riddhi Kumar) హీరోయిన్లుగా నటిస్తుండగా, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ(People Media Factory) బ్యానర్ రాజా సాబ్‌ను నిర్మిస్తోంది. ప్రభాస్ తన కెరీర్ లో మొదటి సారి హార్రర్ నేపథ్యంలో చేస్తున్న మూవీ కావడంతో దీనిపై అందరికీ మంచి అంచనాలున్నాయి.
ఈ సినిమాకు తమన్(Thaman) సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. రీసెంట్ గా తమన్ రాజా సాబ్ మ్యూజిక్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చాడు. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతుంది, దానికి తోడు ప్రభాస్ మూవీ సాంగ్స్ అంటే నార్త్ వాళ్లకు కూడా నచ్చాలి కాబట్టి ఆల్రెడీ చేసిన ట్యూన్స్ మొత్తాన్ని డస్ట్ బిన్ లో వేసేశానని, ఇప్పుడు మళ్లీ ఫ్రెష్ గా రాజా సాబ్ కోసం మ్యూజిక్ ను కంపోజ్ చేస్తున్నట్టు తెలిపాడు.
రాజా సాబ్ లో ఇంట్రో సాంగ్, ఓ మెలోడీ, ఐటెమ్ సాంగ్ కూడా ఉంటుందని, ఐటెమ్ సాంగ్ లో డార్లింగ్ ప్రభాస్ ఏకంగా ముగ్గురు హీరోయిన్లతో కలిసి స్టెప్పులు వేయబోతున్నాడని, వీటితో పాటూ ఓ లవ్ సాంగ్, థీమ్ సాంగ్ కూడా ఉంటాయని తమన్ వెల్లడించాడు. తమన్ చెప్తున్నది బట్టి చూస్తే రాజా సాబ్ కోసం అతనేదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నట్టున్నాడు.













