Thaman: నమ్మిన వాళ్లే మోసం చేశారు: తమన్
సౌత్ ఇండస్ట్రీలో మ్యూజిక్ డైరెక్టర్ గా తమన్(Thaman) తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఎలాంటి సినిమానైనా సరే తమన్ తన మ్యూజిక్‌తో దాన్ని నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్తున్నాడు. మాస్ సినిమాలకు తమన్ ఇచ్చే బీజీఎం సినిమా స్థాయిని అమాంతం పెంచేస్తుంది. రీసెంట్ గా డాకు మహారాజ్(Daku Maharaj) సినిమాతో తమన్ మంచి హిట్ అందుకున్న విషయం తెలిసిందే.
వరుస సినిమాలతో బిజీగా ఉన్న తమన్ రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి. జీవితంలో తాను కొందరిని నమ్మి చాలా మోసపోయానని అన్నాడు. లైఫ్ లో ఏదొక టైమ్ లో మనం కొందర్ని గుడ్డిగా నమ్ముతామని, తాను కూడా అలానే నమ్మానని, కానీ తాను నమ్మిన వాళ్లే తనకు వెన్నుపోటు పొడిచారని తమన్ తెలిపాడు.
తన ముందు తనతో మంచిగా మాట్లాడి, బయటకు వెళ్లి చాలా చెత్తగా మాట్లాడేవారని, కొందరిని నమ్మి డబ్బు కూడా పోగొట్టుకున్నట్టు తెలిపిన తమన్, లైఫ్ లో ఎదురైన ఒడిదుడుకుల వల్ల చాలా లెస్సన్స్ నేర్చుకున్నట్టు చెప్పాడు. తనకు క్రికెట్ అంటే చాలా ఇష్టమని, పని ఒత్తిడి ఎక్కువైనప్పుడు క్రికెట్ ఆడతానని తెలిపాడు. స్టార్ క్రికెటర్లు ఆడే గ్రౌండ్ లో ఆడాలని తనకు ఎప్పటినుంచో ఆశ ఉండేదని సెలబ్రిటీ క్రికెట్ లీగ్ పుణ్యమా అని ఆ ఆశ తీరిందని తమన్ చెప్పుకొచ్చాడు.













