విజయ్ కి అరుదైన గౌరవం
రజనీకాంత్ తరువాత సూపర్‌స్టార్ పట్టాన్ని అందుకునేందుకు రేసులో ఉన్న తమిళ అగ్రనటుడు విజయ్‌కి అరుదైన గౌరవం దక్కింది. మెర్సల్ (తెలుగులో అదిరింది) చిత్రంలో నటనకుగాను ఆయన అంతర్జాతీయ ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు. ఇంటర్నేషనల్ అఛీవ్మెంట్ రికగ్నిషన్ అవార్డు (ఐఏఆర్‌ఏ) సంస్థ అందజేసే ఈ ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపికైన తొలి భారతీయ నటుడిగా విజయ్ రికార్డు సృష్టించారు. విజయ్ అసలు పేరు విజయ్ జోసప్ పేరు మీద ఐఏఆర్‌ఏ ఈ అవార్డును ప్రకటించింది. 2014 నుండి ఐఏఆర్‌ఏ ఈ అవార్డులను ప్రదానం చేస్తుంది. 2018కి గానూ వివిధ దేశాలకు చెందిన 8 మంది హీరోలు పోటీపడ్డారు. మెర్సల్ లో విజయ్ నటన చూసి ఐఏఆర్‌ఏ జ్యూరీ ఫిదా అయ్యింది.
జీఎస్టీ, డిజిటల్ ఇండియా సంభాషణల కారణంగా మెర్సల్ జాతీయ స్థాయిలో ప్రాచుర్యం పొందిన విషయం తెలిసిందే. కాగా ఐఏఆర్‌ఏ అవార్డుకు ఎంపికైన తొలి భారతీయుడిగా రికార్డు సృష్టించిన విజయ్‌కి సినీ ప్రముఖుల నుండి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సీనియర్ నటుడు విజయ్‌కాంత్ చిన్ననాటి విజయ్‌తో ఉన్న ఫొటోని ట్విట్టర్లో షేరీ చేసి మరీ శుభాకాంక్షలు తెలిపారు.













