విజయ్ రెమ్యూనరేషన్ పై అందరికీ అనుమానమే!
తమిళ స్టార్ హీరో విజయ్ ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ తో లియో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా దసరాకు ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం. ఈ సినిమా తర్వాత విజయ్ చేయబోయే సినిమాకు ఏకంగా 200 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ను ఇస్తున్నారనే వార్త బయటకు వచ్చినప్పటి నుంచి ఈ న్యూస్ బాలీవుడ్ మీడియాను సైతం షేక్ చేస్తుంది.
రీసెంట్గా నాగచైతన్యతో కస్టడీ సినిమా చేసిన వెంకట్ ప్రభు దర్శకత్వంలో విజయ్ తన తర్వాతి సినిమాను చేయనున్నాడు. ఏజిఎస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది. స్టోరీ లైన్ విని విజయ్ ఈ సినిమా ఓకే చేశాడని, ఫుల్ స్క్రిప్ట్ రెడీ అవగానే ఈ సినిమాను అధికారికంగా ప్రకటించే అవకాశముంది.
అంతా బానే ఉంది కానీ విజయ్ కు నిజంగా అంత పెద్ద మొత్తంలో రెమ్యూనరేషన్ ఆఫర్ చేశారనే వార్తల్ని చాలా మంది నమ్మలేకపోతున్నారు. దానికి కారణం విజయ్ అంత భారీ భారీ విజయాలను ఇప్పటి వరకు అందుకుంది లేదు. దానికి తోడు ఎప్పటినుంచో విజయ్ ను కోలీవుడ్ లో నెంబర్ 1 హీరో అని ప్రూవ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు.
రజినీకాంత్ కంటే కూడా విజయ్నే పెద్ద హీరో అనేది ఆయన ఫ్యాన్స్ ఎప్పటి నుంచో అంటున్న మాట. విజయ్ నటించిన సినిమాల్లో భారీ కలెక్షన్లు తెచ్చిన సినిమాలున్నాయి కానీ దానికి ఈ రేంజ్ రెమ్యూనరేషన్ అంటే నమ్మశక్యం కావట్లేదు. అసలు మాస్టర్ టైమ్ లో విజయ్ తీసుకున్న రెమ్యూనరేషన్ రూ.80 కోట్లు. ఇంత తక్కువ టైమ్ లో విజయ్ ఈ రేంజ్ కు చేరడానికి తనేమీ పాన్ ఇండియన్ బ్లాక్ బస్టర్లు తీసింది లేదు. అన్నీ నార్మల్ రొటీన్ సినిమాలే. అలాంటప్పుడు విజయ్ కు 200 కోట్ల రెమ్యూనరేషన్ ఎలా ఇస్తున్నారనేది ఎవరికీ అర్థం కావట్లేదు. ఏదైమైనా ఈ వార్తల్లో నిజమెంతనేది విజయ్ చెప్తే తప్ప నమ్మలేం. ఆయనెలాగూ చెప్పడు కాబట్టి, ఈ మిస్టరీ ఇంతే కొనసాగుతుంది.













