Gaddar Awards 2024: ఎంపికైన అవార్డు గ్రహీతలందరికీ తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి హృదయపూర్వక అభినందనలు

తెలుగు సినిమాలకు ఆయా సంబంధిత విభాగాలలో 2024 గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డుల (Gaddar Awards 2024) ను తెలంగాణ ప్రభుత్వం ప్రకటించడం పట్ల తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సంతోషం వ్యక్తం చేస్తోంది.
మరియు, ఈ క్రింద ఉదహరించిన ప్రత్యేక ఆవార్డుల కొరకు ( ఒక్కొక్కరికి రూ. 10.00 లక్షల నగదు బహుమతితో పాటు జ్ఞాపిక మరియు ప్రశంసాపత్రం) శ్రీ మాగంటి మురళీమోహన్ అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేసినందుకు గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారికి , గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ మల్లు బట్టి విక్రమార్క గారికి, రోడ్లు, భవనాలు మరియు సినిమాటోగ్రఫీ మంత్రి శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, శ్రీ వి. వెంకటరమణ రెడ్డి (దిల్రాజు) గారికి, తెలంగాణ ఎఫ్డిసి చైర్మన్, డాక్టర్ ఎస్. హరీష్, (IAS) గారికి తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసారు.
(1) ఎన్టీఆర్ జాతీయ చలనచిత్ర అవార్డు (2) పైడి జైరాజ్ చలనచిత్ర అవార్డు (3) బి.ఎన్. రెడ్డి చలనచిత్ర అవార్డు (4) నాగి రెడ్డి మరియు చక్రపాణి చలనచిత్ర అవార్డు (5) కాంతారావు చలనచిత్ర అవార్డు (6) రఘుపతి వెంకయ్య చలనచిత్ర అవార్డులు ప్రకటించినందుకు సంతోషం తెలియజేస్తు తెలంగాణ ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసారు.
ఎంపికైన అవార్డు గ్రహీతలందరికీ తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి హృదయపూర్వక అభినందనలు తెలియజేసారు.
(టి. ప్రసన్న కుమార్)
గౌరవ కార్యదర్శి