7న తెనాలి రామకృష్ణ ఫస్ట్ లుక్
సందీప్‌కిషన్ తాజా ప్రాజెక్టు తెనాలి రామకృష్ణ బీఏ బీఎల్. తెలుగు, తమిళంలో ఏకకాలంలో రూపొందుతోంది. సినిమా ఫస్ట్‌లుక్ మే 7న విడుదలకానుంది. జి.నాగేశ్వరరెడ్డి ఈ చిత్రానికి దర్శకుడు. హన్సిక హీరోయిన్. పూర్తిస్థాయి వినోదాత్మక చిత్రంగా రూపొందుతున్న సినిమా 60 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. తమిళ నటి వరలక్ష్మీ శరత్‌కుమార్ ఈ సినిమాతో తెలుగుకి పరిచయమవుతుంది. మురళీశర్మ, బ్రహ్మానందం, వెన్నెల కిశోర్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తెనాలి రామకృష్ణ బీఏ బీఎల్‌కు సాయికార్తీక్ సంగీతాన్ని అందిస్తున్నారు. సాయిశ్రీరామ్ ఈ చిత్రానికి కెమెరామెన్. శ్రీ నీలకంఠేశ్వరస్వామి క్రియేషన్స్ పతాకంపై ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఒకే టైంలో తెలుగు, తమిళ భాషల్లో సినిమాను రూపొందిస్తున్నారు.













