రజనీకాంత్‌కు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు దక్కడంపై తెలుగు రాష్ట్రాల సీఎంల హర్షం
సూపర్ స్టార్ రజనీకాంత్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు దక్కడంపై తెలుగు రాష్ట్రాల ముఖ్య మంత్రులు హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారని తెలంగాణ సీఎంవో ఓ ప్రకటన విడుదల చేసింది. ‘‘నటుడిగా దశాబ్దాల పాటు తనకంటూ ఓ ప్రత్యేక శైలిని చాటుకున్నారు. నేటికీ దేశ విదేశాల్లో కోట్లాది మంది అభిమానుల ఆదరణ పొందుతూనే ఉన్నారు. రజనీకాంత్‌కు ఫాల్కే అవార్డు రావడం గొప్ప విషయం. రజనీకాంత్‌కు శుభాకాంక్షలు’’ అని కేసీఆర్ పేర్కొన్నారు.
రజనీ సేవలకు తగ్గ పురస్కారం : ఏపీ సీఎం
సూపర్ స్టార్ రజనీకాంత్‌కు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ప్రకటించడంపై ఏపీ ముఖ్యమంత్రి జగన్ హర్షం వ్యక్తం చేశారు. సినీ రంగానికి ఆయన చేసిన సేవలకు తగ్గ పురస్కారమని కొనియాడారు. కర్నాటకలో జన్మించిన మహారాష్ట్రుడు, తమిళ సూపర్ స్టార్ శివాజీ రావు గైక్వాడ్ అంటూ జగన్ వ్యాఖ్యానించారు. వెండితెరపై తనదైన ప్రత్యేకమై స్టైల్‌తో, మేనరిజమ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారని జగన్ పేర్కొన్నారు.













