అమెరికాలో టూ స్టేట్స్
చేతన్ భగత్ రాసిన నవల ఆధారంగా రూపుదిద్దుకుంటున్న చిత్రం టూ స్టేట్స్. అడవిశేష, శివానీ రాజశేఖర్ జంటగా నటిస్తున్నారు. వెంకట్ రెడ్డి దర్శకుడు. ఎం.ఎల్.వి సత్యనారాయణ నిర్మాత. ఇప్పటి వరకు 60 శాతం చిత్రీకరణ పూర్తయింది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ కోల్కతా, హైదరాబాద్లో రెండు షెడ్యూల్స్ పూర్తయ్యాయి. త్వరలో అమెరికాలో చిత్రీకరణ జరుపుతాం. వీసాలు రావడం ఆలస్యమైనందువల్ల చిత్రీకరణలో జాప్యం జరిగింది. జనవరిలో అమెరికా వెళ్తున్నాం. తిరిగొచ్చాక హైదరాబాద్లో మిగిలిన సన్నివేశాల్ని తెరకెక్కిస్తాం. దాంతో షూటింగ్ పూర్తవుతుందన్నారు. రజత్పూర్, భాగ్యశ్రీ, లిజి, ఆదిత్యమేనన్, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ తదితరులు నటిస్తున్నారు. సంగీతం: అనూప్ రూబెన్స్.













