ఈషాకు మెగా ఛాన్స్ !
అంతంతమాత్రంగా అవకాశాలున్న బ్యూటీకి ఒక్కసారిగా మెగా ప్రాజెక్టులో ఛాన్స్ దొరికితే? ఈషారెబ్బాలా గంతులేడయం ఖాయం. తెలుగు తెరపై నిలదొక్కుకున్న అతి కొద్ది మంది తెలుగు హీరోయిన్లలో ఈషా రెబ్బ పేరు చెపొచ్చు. వొంపుసొంపులు, హస్కీ ఎక్స్ ప్రెషన్స్‌లో కుర్రకారు కళ్లుకు కూలింగ్ గ్లాసెస్‌లా అతుక్కుపోయిన బ్యూటీ. అవకాశాలు అంతంతమాత్రమే ఉన్నా. గ్యాప్‌లేకుండా మాత్రం ఈషాకు సినిమాలు దొరుకుతున్నాయి. సరైన బ్రేక్ కోసం చాలాకాలంగా ఎదురు చూస్తున్న ఈ బ్యూటీకి మెగాస్టార్ సినిమాలో ఛాన్స్ దక్కిందన్న టాక్ ఫిలింనగర్లో బలంగా వినిపిస్తోంది. చిరు కొరటాల కాంబోలో భారీ ప్రాజెక్టు ఒకటి లాంఛనంగా మొదలైన విషయం తెలిసిదే. జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుకానున్న సినిమాలో ఒక పాత్రకోసం దర్శకుడు కొరటాల ఈషాను ఎంపిక చేసుకున్నాడట. ఆమె పాత్ర ఏమిటనేది? ప్రస్తుతానికి సస్పెన్స్. ఈ సినిమాతో ఈషాకు పెద్ద ఛాన్స్‌లు దొరుకుతాయేమో చూడాలి.













