ఈ నెల 30న తెలుగు నిర్మాతల మండలి ఎన్నికలు
అయిదేళ్ల అనంతరం తెలుగు సినిమా నిర్మాతల మండలికి ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎన్నికల షెడ్యూల్ ఇలా ఉంది. నామినేషన్లు స్వీకరించు తేదీలు. జూన్ 12 నుంచి 15వ తేదీ వరకు. నామినేషన్ల ఉపసంహరణ తేదీలు: రెండు ఆపై ఎక్కువ పోస్టులకు నామినేషన్ వేసినవారు 18వ తేదీ లోపల ఏదో ఒక పోస్ట్ వుంచుకోవాలి మిలిగినవి ఉపసంహరించుకోవాలి. ఒకటే పోస్ట్ నామినేషన్ వేసినవారు 22వ తేదీ లోపల ఉపసంహరించుకోవాలి. 22వ తేదీ సాయంత్రం పోటీలో వున్న అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తారు. ఎన్నికల పోలింగ్ సమయం: ఈనెల 30వ తేదీ ఉదయం 9:00 గంటల నుండి మధ్యాహ్నం 2:00 గంటల వరకు. మధ్యాహ్నం 3:00 గంటల తర్వాత నుండి లెక్కింపు జరిపి సాయంత్రానికి విజేతలను ప్రకటిస్తారు.













