Film Chamber: పైరసీని అరికట్టడంలో కీలక పాత్ర పోషించిన ప్రభుత్వానికి, పోలీసులకు ధన్యవాదాలు
భరత్ భూషణ్ గారు మాట్లాడుతూ… “అందరికి నమస్కారం. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఐబొమ్మ అని పైరసీ వెబ్సైటు ఓనర్ ఇమ్మడి రవిని పోలీసులు పట్టుకున్నందుకు పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసేందుకు. దీనికోసం కష్టపడి పనిచేసిన పోలీసు బృందంకి, ప్రభుత్వానికి అలాగే ఛాంబర్ నందు ఉన్న పరిసి సెల్ వారికి కృతజ్ఞతలు.
నిర్మాత సి కళ్యాణ్ గారు మాట్లాడుతూ… “చిత్ర పరిశ్రమ కోసం డిపార్ట్మెంట్ నుండి సీనియారిటీ ఉన్న పోలీసులు పని చేశారు. ఈ ప్రయత్నంలో విదేశి పోలీసులు కూడా మనకి సాయం చేశారు. దేశం మొత్తంలో తెలుగు చిత్ర పరిశ్రమ మాత్రమే పైరసీ సెల్ మెయింటైన్ చేస్తుంది. చాలా కష్టపడి ఐబొమ్మ రవిను పట్టుకున్నారు. దానికి సపోర్ట్ చేసిన తెలంగాణ ప్రభుత్వానికి, పోలీసులకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. రాష్ట్ర ప్రభుత్వం, జాతీయ ప్రభుత్వం కలిసి సినీ పరిశ్రమకు అండగా నిలబడాలి అని కోరుకుంటున్నాము. సోషల్ మీడియా ద్వారా పైరసీ వల్ల జరిగే నష్టాన్ని ప్రేక్షకులకు మరింత అర్థం అయ్యేలా చేయాలి. పైరసీ చేసేవారిని కటినంగా శిక్షించాలి. త్వరలో ప్రభుత్వం నుండి మాకు ఇంతగా అండగా నిలబడి సాయం చేసిన వారిని సత్కరించి మా ధన్యవాదాలు తెలుపుకుంటాము” అన్నారు.
చదలవాడ శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ… ” పైరసీ వారిని పోలీస్ వారిని, ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాము. పట్టుకున్న సినిమా టికెట్ ధరలు ఎక్కువ ఉండటం వల్ల ప్రేక్షకులు సినిమాలను పైరసీలో చూస్తున్నారు అంటున్నారు. కాని ఈ పరిస్థితి వల్ల మిగతా చిన్న సినిమాలు కూడా ఇబ్బంది పడుతున్నాయి. అలాగే సినిమా క్యూబ్, యుఎఫ్ఓ వెళుతున్న సంగతి అర్థమవుతుంది. వారి సర్వర్లు బలంగా ఉండేలా చూసుకోవాలి. ఇకపై వారి దగ్గర నుండి సినిమాలు పైకి అయితే వారు కచ్చితంగా దానికి బాధ్యత తీసుకోవాలి” అన్నారు.
వల్లభనేని అనిల్ కుమార్ గారు మాట్లాడుతూ... “సినిమాలు ప్రస్తుతం విజయం సాధించలేకపోవడానికి ముఖ్య కారణం పైరసీ. అది టెక్నాలజీ మారుతూ వచ్చిన ప్రతిసారి పైరసీ కూడా రూపం మార్చుకుంటూ వచ్చింది. తెలంగాణ ప్రభుత్వం పైరసీని అరికట్టడం చాలెంజ్ గా తీసుకుని పైరసీ చేసేవారిని పట్టుకోవడం జరిగింది. అది సినీ పరిశ్రమకు వరం. టికెట్ ధరలు కూడా కుటుంబంతో సహా వచ్చే విధంగా టికెట్ ధరలు ఉండేలా చూడాలి. పైరసీని పూర్తిగా అరికడితేనే కొత్త నిర్మాతలు ధైర్యంగా ముందుకు వచ్చి సినిమాలు చేస్తారు” అన్నారు.
అమ్మి రాజు గారు మాట్లాడుతూ… “ప్రభుత్వం వారు, పోలీసులు కలిసి మా సినిమా పరిశ్రమకు గొప్ప సాయం చేశారు. ప్రేక్షకులు అందరూ థియేటర్ లోనే చూడాలి అని కోరుకుంటున్నాను. ప్రభుత్వానికి, పోలీసులను మా ధన్యవాదాలు” అన్నారు.
వీర శంకర్ గారు మాట్లాడుతూ… “సినిమా పరిశ్రమ తరపున పైరసీ చేసేవారిని పట్టుకున్నందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. పైరసీ చేసేవారిపై బలమైన చట్టాలు తీసుకురావాలని కోరుకుంటున్నాము. అలాగే సినిమా ఎక్కడ నుండి పైరసీ అవుతుందో వారిపై కూడా నష్టపరిహారం చెల్లించేలా చూడాలి. సెక్యూరిటీ సంబంధిత సంస్థలు బలంగా ఉండేలా చూడాలి. తెలంగాణ ప్రభుత్వం తెలుగు సినీ పరిశ్రమను అంతర్జాతీయ స్థాయికి వెళ్లేందుకు ప్రోత్సహిస్తున్నారు. ఛాంబర్ లోని యాంటీ పైరసీ సెల్ ను అభినందిస్తున్నాము” అన్నారు.
ముత్యాల రామ ప్రసాద్ గారు మాట్లాడుతూ… “పైరసీ చేస్తున్న ఇమ్మడి రవిని పట్టుకోవడం గొప్ప విషయం. కాని ఇలాగే ఎంతో మంది ఉన్నారు. సినిమాలు వేరే వెబ్సైట్లు ద్వారా కూడా ఇలాగే పైరసీ చేస్తున్నారు. వారికోసం రూల్స్ కటినంగా ఉండేలా చేయాలని కోరుకుంటున్నాము. ఐబొమ్మ రవిని పట్టుకున్నందుకు ప్రభుత్వానికి, పోలీసులను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము” అన్నారు.
బాపిరాజు గారు మాట్లాడుతూ… “మేము నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్ గా ఈ పైరసీ వల్ల ఎంతో ఇబ్బంది పడుతున్నాము. వారిని పట్టుకోవడంలో తమ వంతు కృషి చేసిన అందరినీ అభినందిస్తున్నాము. ఈ సినిమాల కోసం మేము ఎంతో కష్టపడి పెట్టుబడులు పెడుతున్నాము. ఇలా పైరసీ చేస్తే మాకు బ్రతకడం చాలా కష్టం అవుతుంది” అన్నారు.
ప్రసన్న కుమార్ గారు మాట్లాడుతూ… “రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు మాకు అండగా నిలబడతాము అన్నారు. థియేటర్ లో కాకుండా HD ప్రింట్ లు రావడంతో సినిమాలు నేరుగా హాక్ చేసి పైరసీ చేస్తున్నారు అని అర్థం అయింది. దానిని అరికట్టేందుకు కూడా చాలా మంది పైరసీ సెల్ నుండి పోలీసులు వరకు కష్టపడి పని చేశారు. వారిని అందరూ అభినందించాలి అని కోరుకుంటున్నాను. పైరసీ వల్ల ఎంతో మంది నష్టపోతున్నారు. కాబట్టి సైబర్ టీమ్ ఇలా సైబర్ నేరాలు చేసే వారికోసం సెపరేట్ డిపార్ట్మెంట్ ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు చిత్ర పరిశ్రమ అంతా కలిసి ఐబొమ్మ ఇమ్మడి రవిని పట్టుకున్నందుకు మరొకసారి ధన్యవాదములు తెలుపుకుంటున్నాము” అన్నారు.
మీడియా నుండి రాంబాబు గారు మాట్లాడుతూ… “పైరసీ జరిగిపోయిన తర్వాత కాకుండా ముందుగానే పైరసీ జరగకుండా ఆపేస్తే మంచిది. పైరసీ అరికట్టడంలో మేము ఎప్పుడూ సపోర్ట్ చేస్తూనే ఉంటాము” అంటూ ముగించారు.






