గౌతంరాజు గొప్ప ఎడిటర్.. ఆయన మరణం దురదృష్టకరం
– సంతాపం తెలియచేసిన చిరంజీవి, మోహన్ బాబు, పవన్ కళ్యాణ్, JR ఎన్టీర్, రాంచరణ్, సాయిధరమ్ తేజ్
ప్రముఖ సీనియర్ ఫిల్మ్ గౌతంరాజు మరణం పట్ల మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ స్పందించారు. గొప్ప ఎడిటర్‌ను కోల్పోయామంటూ వారు సంతాపం తెలిపారు. గౌతంరాజు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గౌతంరాజు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ.. సోషల్ మీడియాలో మెగాస్టార్ పోస్ట్ చేశారు. గౌతంరాజు లాంటి గొప్ప ఎడిటర్ని కోల్పోవడం దురదృష్టకరమన్నారు. ఆయన ఎంత సౌమ్యుడో.. ఆయన ఎడిటింగ్ అంత వాడి అని అన్నారు. ఆయన మితభాషి అని.. కానీ ఆయన ఎడిటింగ్ మెళకువలు అపరిమితమన్నారు చిరంజీవి. ‘చట్టానికి కళ్లు లేవు’ మూవీ నుంచి ‘ఖైదీ నం.150’ సినిమా వరకు తన ఎన్నో సినిమాలకు ఎడిటర్‌గా పనిచేసిన గౌతంరాజు లేకపోవటం వ్యక్తిగతంగా తనకు, మొత్తం సినీ పరిశ్రమకు పెద్ద లోటని అన్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నట్లు చిరంజీవి ట్వీట్ చేశారు.
తెలుగు చిత్ర పరిశ్రమలో ఎడిటర్‌గా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని పొందిన గౌతంరాజు కన్నుమూయడం విచారకరమని జనసేన అధినేత, నటుడు పవన్ కళ్యాణ్ అని అన్నారు. ఎడిటర్‌గా వందల చిత్రాలకు పనిచేసిన అనుభవశాలి అని కొనియాడారు. ఎడిటింట్ విభాగంలో ఎప్పటికప్పుడు సాంకేతికంగా వచ్చే మార్పులను అందిపుచ్చుకున్నారని అన్నారు. తాను నటించిన గోకులంలో సీత, సుస్వాగతం, గబ్బర్ సింగ్, గోపాల గోపాల చిత్రాలకు గౌతంరాజు ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారని గుర్తు చేసుకున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నానని.. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని అన్నారు.
‘ఎడిటర్ గౌతమ్‌రాజు నాకు అత్యంత ఆత్మీయుడు.. నా సొంత బ్యానర్లో ఎన్నో సినిమాలకు ఎడిటర్‌గా పనిచేశారు. అతను మంచి మనిషి. అతని బిడ్డలు కూడా మన స్కూల్లో చదువుకున్నారు. వాళ్ళిద్దరూ క్షేమంగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు. కానీ అతని మరణ వార్త వినగానే నా మనసు కలిచివేసింది. తన ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను..’ అంటూ మోహన్ బాబు ట్వీట్ చేశారు.
ఇటీవల అనారోగ్యంతో బాధపడుతూ.. నగరంలోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో గౌతంరాజు చికిత్స పొందారు. మంగళవారమే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అయితే అర్ధరాత్రి వేళ ఒక్కసారిగా పరిస్థితి విషమించి తుది శ్వాస విడిచినట్లు తెలుస్తోంది. 800కిపైగా సినిమాలలో తన ఎడిటింగ్ మార్క్ చూపించారు. ఖైదీ నెంబర్ 150, గబ్బర్‌సింగ్, కిక్, రేసుగుర్రం, అదుర్స్ వంటి ఎన్నో హిట్ సినిమాలకు ఆయన ఎడిటర్‌గా వర్క్ చేశారు. తెలుగుతో పాటు తమిళ్, హిందీ, కన్నడ భాషల్లోనూ అనేక చిత్రాలకు గౌతంరాజు ఎడిటర్‌గా వ్యవహరించారు. ఎడిటర్ గౌతమ్ రాజు మరణం పట్ల టాలీవుడ్ దిగ్బ్రాంతిని వ్యక్తం చేస్తోంది. గౌతమ్ రాజు మరణం పట్ల ఎన్టీఆర్, రామ్ చరణ్, సాయి ధరమ్ తేజ్ వంటి వారు స్పందించారు.
సాయి ధరమ్ తేజ్ స్పందిస్తూ.. ‘ఎడిటర్ గౌతమ్ రాజు గారి మరణ వార్త విని నా హృదయం బద్దలైంది.. ఎంతో గొప్ప వ్యక్తి.. ఆయన పనితనం ఇంకా ఎంతో గొప్పగా ఉండేది.. నా కెరీర్ ప్రారంభంలో ఆయనతో కలిసి పని చేశాను.. మీరు చేసిన వర్క్‌లో ఎప్పటికీ గుర్తుండిపోతారు.. ఆయన కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి’ అని కోరుకున్నాడు.
ఎన్టీఆర్ స్పందిస్తూ.. ‘సుమారు 850 చిత్రాలకిపైగా ఎడిటింగ్ బాధ్యతలను నిర్వర్తించి తెలుగు సినీ ప్రస్థానంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న గౌతమ్ రాజు గారు అకాల మరణం చెందడం చాలా బాధాకరం.. నేను నటించిన పలు చిత్రాలకు ఆయన ఎడిటర్‌గా పని చేశారు. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతూ, ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను’ అని తెలిపారు.
ఎడిటర్ గౌతమ్ రాజు గారి మరణం సినీ పరిశ్రమకు తీరనిలోటు.. మీరు చేసిన వర్క్ ఎప్పటికీ అలా గుర్తుండిపోతుంటుంది.. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానంటూ రామ్ చరణ్ ట్వీట్ వేశాడు.
Chiranjeevi Tweet
https://twitter.com/KChiruTweets/status/1544543928434601985
Mohan Babu tweet
https://twitter.com/themohanbabu/status/1544587216789577728
https://twitter.com/tarak9999/status/1544593064194297856
Ram charan tweet
https://twitter.com/AlwaysRamCharan/status/1544582648743374848
Sai Dharam Tej tweet
https://twitter.com/IamSaiDharamTej/status/1544540411338715136













