తెలుగు పిలిం చాంబర్ ప్రోడ్యూసర్స్ సెక్టార్ అభ్యంతరం తో ‘వకీల్‌సాబ్’ టికెట్ల పెంపు వద్దని ఆదేశించిన ఏపీ డివిజన్ బెంచ్ కోర్టు
పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ నటించిన ‘వకీల్‌సాబ్’ చిత్రం ఏప్రిల్ 9న విడుదలైంది. మూడు సంవత్సరాల విడుదలైన పవన్ చిత్రం కావడంతో ప్రేక్షకులు ఈ చిత్రానికి బ్రహ్మరథం పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు డివిజన్ బెంచ్ షాక్ ఇచ్చింది. ఈ సినిమా టికెట్ రేట్లను పెంచవద్దని బెంచ్ ఆదేశాలు జారీ చేసింది. వేణుశ్రీరామ్ దర్శకత్వంలో పవన్‌స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం వకీల్‌సాబ్. శుక్రవారం (ఏప్రిల్ 9న) విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. రాజకీయాల కోసం మూడు సంవత్సరాల పాటు సినిమాలకు దూరమైన పవన్‌కళ్యాణ్ ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వడంతో అభిమానుల సంబరాలు అంబరాలు తాకాయి. పైగా సినిమా కూడా బ్లాక్‌బస్టర్ కావడంతో ఇక సెలబ్రేషన్స్ పీక్స్‌కి చేరాయి. సాధారణంగా పెద్ద హీరోల సినిమా విడుదల అవుతుందంటే.. టికెట్ల రేట్లు, షోలు పెంచడం సర్వసాధారణంగా జరుగుతోంది. కానీ, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం వకీల్ సాబ్ టికెట్ రేట్ల హైక్‌కు, బెనిఫిట్ షోలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు.
ఈ క్రమంలో మేకర్స్ ఏపీ కోర్టును ఆశ్రయించారు. వీరి పిటీషన్‌పై విచారణ చేపట్టన సింగిల్ జడ్జి.. టికెట్ల పెంపుదలకు అనుమతి ఇస్తూ ఆదేశాలు జారీ చేశఆరు. అయితే ఏపీ సర్కార్ సింగిల్ జడ్జి ఆదేశాలపై హౌస్ మోషన్ పిటిషన్‌ను దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన డివిజన్ బెంచ్ సింగిల్ జడ్జి ఆదేశాలను సస్పెండ్ చేసింది. మొదటి రెండు రోజులు మాత్రమే టికెట్ రేట్లు పెంచుకొనే అవకాశం ఉందని.. ఆదివారం (ఏప్రిల్ 11) నుంచి టికెట్ల పెంపు వద్దని ఆదేశించింది. హిందీలో బ్లాక్‌బస్టర్ హిట్ సాధించిన ‘పింక్’ సినిమా రీమేక్‌గా ‘వకీల్‌సాబ్’ తెరకెక్కింది. ఈ సినిమాలో నివేదా థామస్, అంజలి, అనన్య, ప్రకాశ్ రాజ్‌లు ప్రధాన పాత్రల్లో నటించగా.. శృతి హాసన్ హీరోయిన్గా చేసింది. బోణి కపూర్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు ఈ సినిమాను నిర్మించారు.
టికెట్ రేట్ పెంచితే ఎవరికి లాభం? యేలూరు సురేందర్ రెడ్డి. చైర్మన్…. తెలుగు పిలిం చాంబర్ ప్రోడ్యూసర్స్ సెక్టార్.
ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సినిమా టికెట్ విషయంలో మొన్న తీసుకున్న నిర్ణయం మీద రకరకాలుగా అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే నా ఉద్దేశం మట్టుకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం సరైనది అని అనుకుంటున్నాను. ఎందుకంటే టికెట్ రేటు పెంచితే ఎవరికి లాభం వస్తుంది .ప్రధానం హీరోకే. 5 కోట్లు 10 కోట్లు,20 ,30 ,40,, 50కోట్లు, టిక్కెట్ రేటు పెరిగేకొద్దీ హీరో ల రెమ్యునరేషన్ అలాగే పెరుగుతూ పోతూనేవుంది.మరలా భాగం కూడా. అడిగితే డిమాండ్ ఎండ్ సప్లై అంటారు. ప్రేక్షక దేవుళ్ళు దేవుళ్ళు అంటున్నారు 500,1000 టిక్కెట్ రేట్లు పెట్టి దోచుకుంటున్నారు .ఇది ఎంతవరకు కరెక్ట్. బెనిఫిట్ షోలు కానివ్వండి మొదటిరోజు కానివ్వండి ఎక్కువగా సినిమాకి క్యూ కట్టేది మధ్యతరగతి ప్రజలే .అలాగే మామూలు సందర్బాలలో కూడా ఈ టికెట్ రేటు ఎక్కువ గా వుండటం తో చిన్న సినిమాలు దారుణంగా పడిపోయాయి. ఎందుకంటే చిన్న సినిమాలకి పేస్ వ్యాల్యూ ఉండదు కనుక 150,200 టిక్కెట్ కొనుక్కుని చూసేందుకు ముందుకు రారు.
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెట్టిన టికెట్ రేట్లు ఇలాగే ఉంచగలిగితే చిన్న సినిమాలకి చాలా మంచి భవిష్యత్తు ఉంటుంది .పెద్ద సినిమాలకి కూడా100 రూపాయలు టిక్కెట్ నష్టమేం లేదు. ఆ పెద్ద హీరో ల రెమ్యునరేషన్ తగ్గుతుంది తప్పితే ఇండస్ట్రీలో వందల మంది నిర్మాత లు కళ కళ లాడుతూ వుంటారు.
సామాన్యుడికి అందుబాటులో ఉండేది సినిమా అనే వినోదం. ప్రేక్షకుల బలహీనత అడ్డు పెట్టుకొని ఇలా టిక్కెట్ రేటు పెంచి ,కొద్ది మంది హీరో లు తమ రెమ్యునరేషన్ పెంచుకోటానికి తప్పితే మరోటి కాదు. హీరో లు పెద్ద నీతులు చెబుతున్నారు. టాక్స్ రూపంలో ఎంతచూపిస్తారో అందరికీ తెలుసు. ఈ టికెట్ రేట్లు ఇష్టప్రకారం పెంచటం వల్ల ఇండస్ట్రీకూడా నలుగురు చేతుల లో వెళ్లి పోయింది.చిన్న సినిమాల ని సర్వనాశనం చేశారు.ఈ టిక్కెట్ రేట్లు పెంపువలనే తియేటర్స్ మీద గుత్తాదిపత్యం వేళ్లూరింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరలా ఎవరి వత్తిడి కి లోంగకుండా ఇదేరేట్లు కంటిన్యూ చేయాలని వందల మంది చిన్న చిత్ర నిర్మాత లు కోరుకుంటున్నారు. తెలంగాణ గవర్నమెంట్ ఈ మద్య చిన్న సినిమా లని చిన్న చూపు చూస్తుంది. ఏపీ గవర్నమెంట్ టికెట్ రేటు విషయంలో తీసుకున్న నిర్ణయం తెలంగాణా ప్రభుత్వం కూడా తీసుకోగలిగితే చిన్న,పెద్ద సినిమాలకు భవిష్యత్తు అద్బుతంగా ఉంటుంది .పెద్ద సినిమాలు కూడా ఎక్కువ రోజులు ఆడేదానికి అవకాశం వుంటుంది.













