హాస్యనటుడు గుండు హనుమంతరావు కన్నుమూత
ప్రముఖ సినీ హాస్యనటుడు గుండు హనుమంతరావు గత కొద్దికాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఎస్సార్‌నగర్‌లోని స్వగృహంలో తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. గతకొంతకాలంగా మూత్రం సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. 3.30 గంటల సమయంలో అనారోగ్యానికి గురైన ఆయన్ని కుటుంబసభ్యులు ఎర్రగడ్డలోని సెయింట్ థెరిసా ఆస్పత్రికి తరలించారు. ఆయన్ని పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. ఇటీవల గుండు హనుమంతరావు అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలుసుకున్న ప్రముఖ సినీనటుడు చిరంజీవి ఆయనకు రూ.2లక్షల ఆర్థికసాయం అందించారు. తెలంగాణ ప్రభుత్వం కూడా సీఎం సహాయనిధి నుంచి రూ.5లక్షలు మంజూరుచేసింది. తెలుగు సినిమాల్లో హాస్యనటుడిగా ఆయన 400 సినిమాల్లో నటించారు. అమృతం అనే టీవీ సీరియల్ ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టింది. మూడు సార్లు టీవీ కార్యక్రాలకిచ్చే నంది అవార్డులు అందుకున్నారు.













