ఏలూరులో సినీతారల సందడి
ఏలూరులో సినీతారలు సందడి చేశారు. జివి షాపింగ్‌మాల్‌లో వస్త్రాలు కొనుగోలు చేసే వినియోగదారులు మంచి షాపింగ్ అనుభూతిని పొందుతారని ప్రముఖ సినీతారలు రాశిఖన్నా, మెహరీస్ కౌర్, రీతూవర్మ అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు నగరంలోని విజయవిహార్ సెంటర్లో జివి షాపింగ్‌మాల్ పేరిట ఏర్పాటు చేసిన నూతన వస్త్ర దుకాణాన్ని ప్రారంభించారు. అనంతరం వారు మాల్లో దస్తులను వీక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏలూరు నగరంలో జివి మాల్లో ప్రముఖ నేత కళాకారులు నేసిన వస్త్రాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఎవరైనా పండుగ సందర్భాల్లో ఆఫర్స్ పెడతారని, జివి మాల్లో 365 రోజులు ఆఫర్స్ ఉంటాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏలూరు టిడిపి ఎంపీ మాగంటి బాబు, ఎమ్మెల్యే బడేటి బుజ్జి, నగర మేయర్ షేక్ నూర్జహాన్, కో ఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు పాల్గొన్నారు.













