వచ్చిన ఆఫర్లు వదిలేసుకున్న తెలుగమ్మాయి
తెలుగమ్మాయి ఈషా రెబ్బా నటిగా చాలానే సినిమాలు చేసింది. తను కెరీర్ స్టార్ట్ చేసి పదేళ్లు అవుతున్నా ఇప్పటికీ బిజీ హీరోయిన్ కాలేకపోయింది. అరవింద సమేతలో హీరోయిన్ చెల్లి క్యారెక్టర్ చేసిన ఈషాకు ఆ సినిమా మంచి గుర్తింపే తెచ్చింది. ఆ తర్వాత కొన్ని ఆఫర్లు కూడా వచ్చాయి. కోలీవుడ్ లో కూడా మరో రెండు మూడు సినిమాలు చేసింది.
తాజాగా సుధీర్ బాబు హీరో గా వస్తున్న మామా మశ్చీంద్ర సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా కాకుండా అమ్మడి చేతిలో మరికొన్ని ఛాన్సులున్నట్లు తెలుస్తోంది. అయితే కెరీర్ స్టార్ట్ అయి ఇన్నేళ్లవుతున్నా తను బిజీగా మారకపోవడానికి గల కారణాల్ని రీసెంట్గా ఈషా వెల్లడించింది. అరవింద సమేత తర్వాత అలాంటి క్యారెక్టర్లు తనకు చాలానే వచ్చాయట.
కానీ ఒకే రకమైన క్యారెక్టర్లు చేస్తే గుర్తింపు రాదని, తనకు మొదటి నుంచి డిఫరెంట్ గా ఉండే క్యారెక్టర్లు చేయడమే ఇష్టమని, ఏ సినిమా చేసినా తన పాత్రకు కొత్తదనం ఉండాలని కోరుకుంటానని, అలాంటి పాత్ర ఏదైనా సరే చేయడానికి ఆలోచించనని చెప్పుకొచ్చింది. మామా మశ్చీంద్ర లో పాత్ర డిఫరెంట్ గా ఉంటుందని ఈషా తెలిపింది.













