కత్తి మహేష్ కు ప్రమాదం : ఇప్పటికైనా అది పెట్టుకో! పూనమ్ కౌర్ పరోక్ష సెటైర్!

ఫిలిం క్రిటిక్, నటుడు కత్తి మహేష్‌కు రోడ్డు ప్రమాదం జరిగిన వార్తలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. సీట్ బెల్ట్ పెట్టుకోలేదంట, కారుకి అడ్డంగా ట్రక్ వచ్చేసరికి డ్రైవింగ్ సీట్లో ఉన్నాయన సేఫ్ గానే ఉన్నాడు. కానీ ఈయనకి గట్టిగా తగిలాయి, ఒక కన్ను పూర్తిగా డ్యామేజ్ అంటున్నారు. అయితే ఈ ప్రమాదంపై కొందరు సెటైర్లు వేస్తున్నారు. మరీ ముఖ్యంగా జన సైనికులు కౌంటర్లు వేస్తున్నారు. సినీ క్రిటిక్, నటుడు కత్తి మహేష్‌కు రోడ్డు ప్రమాదం జరిగిన వార్తలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ ప్రమాదంపై కొందరు సెటైర్లు వేస్తున్నారు. మరీ ముఖ్యంగా జన సైనికులు కౌంటర్లు వేస్తున్నారు. అయితే తాజాగా పూనమ్ కౌర్ వేసిన ఓ ట్వీట్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇది కచ్చితంగా కత్తి మహేష్‌కు జరిగిన ప్రమాదం మీదే అయి ఉంటుందని కామెంట్లు పెడుతున్నారు. ఇంతకీ పూనమ్ కౌర్ వేసిన ట్వీట్ సారాంశం ఏంటో, కత్తి మహేష్‌కు ప్రమాదం ఎలా జరిగిందనేది ఓ సారి చూద్దాం.
కొడవలూరు మండలం చంద్రశేఖరపురం దగ్గర జాతీయ రహదారిపై మహేష్ ప్రయాణిస్తున్న ఇన్నోవా కారు అదుపుతప్పి ముందు వెళ్తున్న కంటెనర్‌ను ఢీకొట్టింది. వెంటనే కారులో ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోవడంతో కత్తి మహేష్ ప్రమాదం తప్పి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. శుక్రవారం అర్ధరాత్రి సమయంలోఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాద సమాచారం తెలుసుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. వెంటనే ఆయన్ని నెల్లూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంలో కత్తి మహేష్ కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసం అయ్యింది. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
కత్తి మహేష్‌ది సొంత జిల్లా చిత్తూరు. అక్కడి నుంచి హైదరాబాద్ వెళుతుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ వ్యవహారంపైనే పూనమ్ కౌర్ స్పందించినట్టు తెలుస్తోంది. రాముడిని, సీతని నీ అవసరానికి ఇష్టమొచ్చినట్టుగా వాడుకున్నావ్, వదిలేశావ్ ఇప్పటికైనా ప్రయాణం చేసేటపుడు అది పెట్టుకో (సీట్ బెల్ట్ ) పెట్టుకో! నువ్ ప్రాణాలతో బయటపడాలని కోరుకుంటున్నాను.. ఎందుకంటే ఇకనైనా అసలు జీవితాన్ని చూస్తావ్ అని. ఇప్పటికైనా అమ్మాయిలను, అమ్మని గౌరవించడం నేర్చుకో జై శ్రీరామ్ అని పూనమ్ కౌర్ ట్వీట్ వేశారు. అయితే నెటిజన్లు మాత్రం అది కత్తి మహేష్ గురించేనని అంటున్నారు. మరి దీనిపై పూనమ్ కౌర్ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. కత్తి మహేష్ పవన్ కళ్యాణ్ పూనమ్ కౌర్ వ్యవహారం ఒకప్పుడు మీడియాలో ఎంతటి సెన్సేషన్‌కు దారి తీసిందో అందరికీ తెలిసిందే.