Chatrapathi Sivaji: ఛత్రపతి శివాజీ సినిమాలో తెలుగు నటుడు
ఛత్రపతి శివాజీ కొడుకు శంబాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఛావా(Chhava) ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లతో దూసుకెళ్తుంది. ఈ టైమ్ లో శివాజీ 395వ జయంతని పురస్కరించుకుని ఈ ఫిబ్రవరి 19న ది ప్రైడ్ ఆఫ్ భారత్ః ఛత్రపతి శివాజీ మహారాజ్ (Chatrapathi Sivaji Maharaj) సినిమాను అనౌన్స్ చేస్తూ దానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు.
ఇందులో శివాజీ పాత్రలో శాండిల్ వుడ్ స్టార్ హీరో రిషబ్ శెట్టి(Rishab Shetty) నటిస్తున్నాడు. ఈ పోస్టర్ లో శివాజీగా ఉన్న రిషబ్ శెట్టి ఆ పాత్రకు బాగా సెట్ అయ్యాడు. శివాజీ కథ ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా కావడంతో ఈ మూవీపై ఇప్పటికే మంచి బజ్ క్రియేట్ అయింది. ఇదిలా ఉంటే ఈ మూవీకి సంబంధించి ఇప్పుడు ఓ ఆసక్తికర వార్త వినిపిస్తుంది.
టాలీవుడ్ నుంచి ప్రముఖ నటుడు ది ప్రైడ్ ఆఫ్ భారత్ సినిమాలో కీలక పాత్రలో నటించనున్నాడట. ఈ విషయం ఇంకా డిస్కష్స్ లోనే ఉందని, త్వరలోనే ఆ నటుడెవరనేది రివీల్ కానున్నట్టు చెప్తున్నారు. 2027న జనవరి 21న ఈ సినిమా రిలీజ్ కానున్నట్టు మేకర్స్ తెలిపారు. అయితే రీసెంట్ గా శంభాజీ మహారాజ్ కథగా వచ్చిన చావా మూవీనే ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తుంటే ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇంకెన్ని రికార్డులు సృష్టిస్టాడో చూడాలి.













