“తెలుగింటి సంస్కృతి” మ్యూజిక్ వీడియోకు సూపర్బ్ రెస్పాన్స్
పెళ్లాం ఊరెళితే, ఇంద్ర వంటి చిత్రాల ఫేమ్, నటి ప్రశాంతి హారతి కూతురు తాన్య హారతి నటించిన వీడియో ఆల్బమ్ “తెలుగింటి సంస్కృతి” మ్యూజిక్ లవర్స్ ను ఆకట్టుకుంటూ సూపర్బ్ సక్సెస్ అందుకుంది. ఈ మ్యూజిక్ వీడియోకు ప్రముఖ దర్శకుడు వీఎన్ ఆదిత్య కాన్సెప్ట్ తయారుచేసి రూపొందించారు. “తెలుగింటి సంస్కృతి” లో కిరణ్ గుడిపూడి మరో లీడ్ రోల్ చేశారు.
దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు రిలీజ్ చేసిన ఈ మ్యూజిక్ వీడియో వన్ మిలియన్ కు పైగా వ్యూస్ తో మంచి సక్సెస్ అందుకుంది. “తెలుగింటి సంస్కృతి” మ్యూజిక్ వీడియో సక్సెస్ తమ టీమ్ లో ఆత్మవిశ్వాసాన్ని నింపిందని, ఆడియెన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే హ్యాపీగా ఉందని మ్యూజిక్ వీడియో టీమ్ తెలిపింది. డైరెక్టర్ వీఎన్ ఆదిత్య, రాఘవేంద్ర రావు గారికి టీమ్ మెంబర్స్ థ్యాంక్స్ చెప్పారు. ఈ మ్యూజిక్ వీడియోకు రాధాకృష్ణ హారతి నిర్మాతగా వ్యవహరించారు. మురళి రుద్ర, అన్వేష్ మావిళ్ళపల్లి, ఆనంద్ పవన్ నాయుడు ఎడిటర్స్ కాగా..ఎస్ ఎ ఖుద్దూస్ సంగీతం అందించారు. శ్రీ రామ్ తపస్వి గీత రచన చేశారు. “తెలుగింటి సంస్కృతి” ఆల్బమ్ ను ప్రముఖ నేపధ్య గాయని శ్రీనిధి పాడారు.













