సైరా కు గవర్నర్ అభినందనలు
తొలి స్వాతంత్య్ర సమరయోధుల్లో ఒకరైన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితచరిత్ర ఆధారంగా నిర్మించిన సైరా చిత్రాన్ని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ తిలకించారు. సినిమా హీరో మెగాస్టార్ చిరంజీవి కోరిక మేరకు గవర్నర్ తన కుటుంబసభ్యులతో సినిమా చూశారు. గవర్నర్ కోసం ప్రసాద్‌ల్యాబ్‌లో ప్రత్యేకషోను ఏర్పాటు చేశారు. గవర్నర్‌తో పాటు చిరంజీవి, కాస్ట్యూమ్ డిజైనర్ సుష్మిత హాజరయ్యారు. గొప్ప చరిత్రకారుడు, తొలి స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యలవాడ నరసింహారెడ్డి చరిత్రను వెలుగులోకి తెచ్చి నేటి తరానికి అందించిన చిత్రబృందాన్ని గవర్నర్ అభినందించారు. చిరంజీవి నటన బాగుందని, నరసింహారెడ్డి పాత్రకు జీవం పోశారని అన్నారు. సినిమాను తిలకించినందుకు చిరంజీవి గవర్నర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.













