అనీల్ రావిపూడి కి దక్కిన గొప్ప గౌరవం
రవితేజ, అనీల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం రాజా ది గ్రేట్. అక్టోబర్ 18న విడుదలైన ఈ చిత్రం అందరి ప్రశంసలు అందుకుంది. ఈ చిత్రంలో కేవలం కమర్షియల్ హంగులే కాకుండా సమాజానికి ఉపయోగపడే మంచి అంశాన్ని కూడా జోడించడంతో రాజా ది గ్రేట్ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఒక హీరో కళ్లులేని వాడిగా కనిపించి అందరిని ఎంతో నవ్వించి ఒక మంచే మెస్సేజ్ ని ఇవ్వగానే ఇచ్చాడు. అయితే అలాంటీ మంచి సినిమాను తెరకెక్కించిన అనిల్ ని తెలంగాణా ప్రభుత్వం వికలాంగుల సంక్షేమ శాఖ – సీనియర్ సిటిజన్స్ డిపార్ట్మెంట్ సత్కరించింది. అతనిపై పలువురు అధీకారులు ఎన్నో ప్రశంసలను అందించారు. మంచి చిత్రం వస్తే తెలంగాణ ప్రభుత్వం వారిని తప్పకుండా గుర్తిస్తుందని అధికారులు మాట్లాడారు.













