టాలీవుడ్ కు ఆ దిగులు లేదు
తెలంగాణ ఎన్నికల తేదీని ఎలక్షన్ కమిషన్ అనౌన్స్ చేసింది. దేశ రాజకీయాల్లో అత్యంత కీలక ఘట్టాల్లో ఒకటైన తెలంగాన ఎన్నికలు నవంబర్ 30న జరగనుండగా, డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు ఉంటుందని ఈసీ అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. ఈసీ అనౌన్స్ చేసిన డేట్స్ తో టాలీవుడ్ నిర్మాతలందరూ ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. దానికి కారణం ఆ రోజున చెప్పుకోదగ్గ సినిమాలేవీ రిలీజ్ కు రెడీ కాకపోవడమే.
లేకపోతే ఆ ఎలక్షన్స్ ప్రభావం వల్ల సినిమా కలెక్షన్స్ తగ్గే ఛాన్సుంది. నవంబర్ 23న రానున్న కళ్యాణ్ రామ్ డెవిల్ తర్వాత ఆ నెలలో మరో సినిమా ఇప్పటివరకు షెడ్యూల్ అయింది లేదు. సిద్దు జొన్నలగడ్డ నటిస్తున్న టిల్లూ స్వ్కేర్ అనుకున్నారు కానీ ఇక ఇప్పుడు దాన్ని కూడా వాయిదా వేసేస్తారు. డిసెంబర్ 1న రణ్బీర్ కపూర్ యానిమల్ రిలీజ్ కానుంది.
ఎలాగూ పోలింగ్ అయిపోయి ఉంటుంది కాబట్టి పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరముండదు. కానీ కౌంటింగ్ రోజు అంటే డిసెంబర్ 3న మాత్రం కలెక్షన్ల మీద ప్రభావం పడే ఛాన్స్ ఎంతైనా ఉంది. తర్వాత డిసెంబర్ 7న రిలీజ్ అయ్యే సినిమాలకు ఎలాగూ ఎఫెక్ట్ ఉండదు. కానీ సలార్ రిలీజ్ నాటికి మాత్రం పర్మిషన్స్ విషయంలో కాస్త పని పడుతుంది. మొత్తానికి తెలంగాణ ఎన్నికల ఎఫెక్ట్ తెలుగు చిత్ర పరిశ్రమ మీద ఏ మాత్రం ఉండదు అనేదైతే చెప్పగలం.













