ఘనంగా పైడి జయరాజ్ 109వ జయంతి వేడుకలు
తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆధ్వర్యంలో దివంగత నటుడు పైడి జయరాజ్ 109వ జయంతి వేడుక జరిపారు. కరీంనగర్ జిల్లాకు చెందిన పైడి జయరాజ్ ఏడు దశాబ్దాల క్రితమే బాలీవుడ్ చిత్రాల్లో నటించాడు. ఆయన సేవలకు కేంద్రం దాదా సాహెబ్ ఫాల్కే పురస్కాం అందించింది. ఈ అవార్డు అందుకున్న తొలి తెలుగు నటుడు ఆయన. హైదరాబాద్ జయంతి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఢిల్లీ అధికార ప్రతినిధి ఎస్.వేణుగోపాలచారి, తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ చైర్మన్ ప్రతాని రామకృష్ణ గౌడ్, నటుడు జైహింద్ గౌడ్, ఫిల్మ్ ఛాంబర్ కార్యదర్శి ముత్యాల రాందాసు పాల్గొని జయరాజ్ సేవలను కొనియాడారు.













