హను మాన్ బడ్జెట్ ఎంతో తెలుసా?
ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జ హీరోగా వస్తోన్న సూపర్ హీరో మూవీ హను మాన్. వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రలో నటిస్తున్న హను మాన్ లో అమృత అయ్యార్ హీరోయిన్ గా నటిస్తోంది. అంజనాద్రి అనే ఫిక్షనల్ విలేజ్ బ్యాక్ డ్రాప్ లో హను మాన్ కత నడుస్తుందని తెలుస్తోంది. రీసెంట్ గా ఈ సినిమా నుంచి రిలీజైన ట్రైలర్ కు కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది.
హను మాన్ సినిమా సంక్రాంతికి తగ్గ సినిమా అవుతుందని ఇప్పటికే మేకర్స్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. హను మాన్ లాంటి చిన్న సినిమాను స్టార్ హీరోల సినిమాలతో కలిపి పోటీగా రిలీజ్ చేయడం అవసరమా అని కొందరు అన్న మాటలకు దర్శకుడు, హీరో స్ట్రాంగ్ కౌంటర్ కూడా ఇచ్చారు.
తాము చిన్న వాళ్లైనా, తమ సినిమా పెద్దదని.. హను మాన్ అనే పేరే తమ సినిమాకు కొండంత బలమని వారు చెప్పారు. ఎలాంటి స్టార్ క్యాస్టింగ్ లేకపోయినప్పటికీ ఈ సినిమాకు ఏకంగా రూ.42 కోట్లు బడ్జెట్ ఖర్చు పెట్టారట. కథ మీద నమ్మకంతో ఇంత పెద్ద మొత్తంలో బడ్జెట్ ను ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది. పెట్టిన బడ్జెట్ లో ఇప్పటికే డిజిటల్, శాటిలైట్ రైట్స్ ద్వారా మెజారిటీ రికవరీ అయిందని, థియేట్రికల్ బిజినెస్ కూడా భారీగా జరిగిందని సమాచారం. మరి ఇంత పోటీ నడుమ హనుమాన్ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.













