మహేష్ ఫ్యాన్స్ ను ఇంప్రెస్ చేసిన తేజ సజ్జ
ఈ సంక్రాంతికి టాలీవుడ్ లో చాలా పెద్ద పోటీనే ఉంది. ఎప్పుడూ లేనివిధంగా ఈ సంక్రాంతికి 5 డిఫరెంట్ జానర్ సినిమాలు, క్రేజీ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఇందులో చిన్న సినిమా అంటే హను మాన్. అదే రోజు సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం కూడా రిలీజవుతోంది. జనవరి 12న హనుమాన్, గుంటూరు కారం థియేటర్లలోకి రావడానికి ముస్తాబవుతున్నాయి.
వాస్తవానికి మహేష్ మూవీతో పోటీ పడే స్థాయి తేజ సినిమాకు లేదు. కానీ హనుమాన్ స్థాయి, క్రేజ్ వేరు. ఆ నమ్మకంతోనే హనుమాన్ ను సంక్రాంతి బరిలో దింపాలని టీమ్ చూస్తుంది. తము చిన్నవాళ్లైనా, తమ సినిమా పెద్దదని పలుసార్లు సినిమా గురించి చిత్ర బృందం చెప్తూ వస్తోంది. తాజాగా ఓ నెటిజన్ తేజ సజ్జ గురించి నెట్టింట ఓ పోస్ట్ చేశాడు.
ఒకప్పుడు మహేష్ బాబు సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన తేజ సజ్జ, ఇప్పుడు మహేష్ తో పోటీగా సినిమా రిలీజ్ చేస్తున్నాడని ఆ నెటిజన్ పోస్ట్ చేశాడు. దానికి తేజ సజ్జ ఇచ్చిన రిప్లై మహేష్ ఫ్యాన్స్ ను సైతం ఫిదా చేసంది. తాను సూపర్ స్టార్ మహేష్ తో పోటీపడటం ఏంటని, తాను మహేష్ కు పోటీగా రావడం లేదని, మహేష్ తో పాటూ వస్తున్నట్లు ఆ ట్వీట్ లో తేజ పేర్కొన్నాడు. మరి జనవరి 12న రిలీజ్ కానున్న హనుమాన్, గుంటూరు కారం సినిమాల్లో ఏ సినిమా మంచి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.













