తీన్మార్ ఫ్లాప్‌కు పవన్ ఇమేజే కారణమా?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన కెరీర్లో ఫీల్ గుడ్ సినిమాలను చాలానే తీశాడు. అందులో ఒక మంచి సినిమా తీన్మార్. హిందీ సూపర్ హిట్ లవ్ ఆజ్ కల్కు రీమేక్‌గా వచ్చిన ఈ సినిమాలో మంచి పాటలతో పాటూగా ఫీల్ ఉన్న లవ్ సీన్స్ కూడా ఉంటాయి. రెండు పాత్రల్లో పవన్ నటన ఇంప్రెస్సివ్‌గా ఉంటుంది. అంతేకాదు డైలాగ్స్ కూడా చాలా బాగుంటాయి.
త్రివిక్రమ్ హెల్ప్ తో తీన్మార్ను చాలా బ్యూటిఫుల్ గా తెరకెక్కించాడు డైరెక్టర్ జయంత్ సి. పరాన్జీ. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అనుకున్న రిజల్ట్ ను ఇవ్వకపోగా. ఫ్లాప్ గానే మిగిలింది. అయితే తర్వాత టీవీల్లో, డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ లో తీన్మార్కు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇలాంటి సినిమానేనా అప్పట్లో ఫ్లాప్ చేసింది అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు .
అయితే ఈ సినిమా ఫ్యాప్ అవడానికి రీజన్ పవన్ కళ్యాణ్ స్టార్ ఇమేజే అంటున్నాడు డైరెక్టర్ జయంత్. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో తీన్మార్ రిజల్ట్ గురించి మాట్లాడిన జయత్, ఈ సినిమా విషయంలో పవన్ ఫ్యాన్స్ తర్వాతి కాలంలో ఇచ్చిన ఫీడ్‌బ్యాక్ కు తనకు మతి పోయిందని చెప్పుకొచ్చాడు. అంతేకాదు తమ హీరో ప్రేమించిన అమ్మాయి, వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుని వెళ్లిపోవడం, తిరిగి మళ్లీ తన దగ్గరికి రావడం తమకు నచ్చలేదని ఫ్యాన్స్ చెప్పినట్లు జయంత్ తెలిపాడు.
పవన్ ఫ్యాన్స్ ఇలా థింక్ చేస్తారని తను అనుకోలేదని, దీన్ని బట్టి పవన్ ఇమేజే సినిమా ఫెయిల్ అవడానికి కారణమని తనకు అనిపించిందని ఆయన తెలిపాడు. అంతే కాదు ఈ సినిమాను పవన్ ఎంతో నచ్చి చేశాడని, పవన్ బదులు ఈ సినిమాను లవర్ బాయ్ ఇమేజ్ ఉన్న హీరో చేసి ఉంటే మంచి రిజల్ట్ వచ్చేదని ఆయన అభిప్రాయపడ్డాడు.













