పెళ్లిచూపులు దర్శకుడితో పెళ్లికాని ప్రసాద్
మళ్లీశ్వరి చిత్రంలో వెంకటేష్ పోషించిన పెళ్లికాని ప్రసాద్ పాత్ర ఎంతగా అలరించిందో తెలిసిందే. అలాగే తరుణ్ భాస్కర్ దర్శకుడిగా పరిచయమవుతూ రూపొందించిన పెళ్లిచూపులు అనూహ్య విజయం సాధించడమూ తెలిసిందే. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం పెళ్లిచూపులు ఫేమ్ తరుణ్‌భాస్కర్‌తో పెళ్లికాని ప్రసాద్ నటించనున్నారు. ప్రస్తుతం వెంకీమామ చిత్రంలో నటిస్తున్న వెంకటేష్.. ఈ చిత్రం అనంతరం తరుణ్ భాస్కర్‌తో జత కట్టే అవకాశం ఉంది. పెళ్లిచూపులు తరువాత తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన ఈ నగరానికి ఏమైంది ఆశించిన స్థాయిలో విజయం సాధించనప్పటికీ అతని బ్రాండ్ ఇమేజ్‌కి పెద్దగా నష్టం వాటిల్లలేదు. పైగా ఇటీవల విడుదలైన ఫలకనుమాదాస్లో తరుణ్ భాస్కర్ ఇచ్చిన ఎంట్రీకి మంచి స్పందన వస్తోంది.













