జాతీయ అవార్డు దర్శకుడికి మూడో సినిమా ఇంత గ్యాపా?
నాలుగైదు షార్ట్ ఫిలిమ్స్ చేసి ఆ తరువాత విజయ్ దేవరకొండ పెళ్లిచూపులు చిత్రంతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు దర్శకుడు తరుణ్ భాస్కర్ ధాస్స్యం. ఆ మూవీతో జాతీయ అవార్డు గెలుచుకున్న ఆయన టాలీవుడ్ ని దున్నేయడం ఖాయం అనుకున్నారు. అయితే ఈ దర్శకుడు మాత్రం ఆ స్థాయిలో దూసుకు వెళ్లడం లేదు. పెళ్లిచూపులు చిత్రం తరువాత ఆయన ఈ నగరానికి ఏమైంది? అనే ఓ విభన్నమైన సినిమా చేశారు. కాన్సెప్ట్ అండ్ టేకింగ్ పరంగా ఆ మూవీకి మంచి మార్కులు పడ్డా కమర్షియల్ గా ఆశించిన విజయం సాధించలేదు.
ఆ మూవీ విడుదలై రెండేళ్లు దాటిపోతుంది. అయినా ఈ దర్శకుడు నుండి మరో చిత్రం రాలేదు. ఈ మధ్యలో నటుడిగా, హీరోగా కూడా చేశారు. డైరెక్షన్ పైన ఫోకస్ పెట్టకుండా మళ్ళీ యాక్టింగ్ అంటూ ఎందుకు డైవర్ట్ అవుతున్నాడనే విమర్శలు కూడా రావడం జరిగింది. అంతే కాకుండా ఈ టివి వారికీ మీకు మాత్రమే చెప్తా అనే షో కమిట్ అయ్యాడు. ఆ మధ్య ఎన్టీఆర్ పై కామెంట్స్ చేసి ఫ్యాన్స్ చేత తిట్లు తిన్నాడు. సూపర్ స్టార్ మహేష్ బాబు మూవీస్ పై కామెంట్స్ చేసినందుకు సూపర్ స్టార్ ఫ్యాన్స్ చేత విపరీతంగా ట్రోలింగ్ కి గురయ్యి బాగా చివాట్లు, తిట్లు తిన్నాడు. అయితే చాలా నెలలు తరువాత తరుణ్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ విక్టరీ వెంకటేష్ తో సెట్ చేశారు. సురేష్ బాబు నిర్మించనున్న ఈ మూవీపై వీరి మధ్య చర్చలు కూడా సఫలం కావడం జరిగింది. వెంకీ మామ మూవీ తర్వాత వెంకీ తరుణ్ భాస్కర్ మూవీ చేస్తారని అందరూ అనుకున్నారు. కానీ వెంకీ నారప్ప ప్రకటించడం జరిగింది. మరి ఈ చిత్రం తర్వాత అయినా మూవీ ఉంటుంది అనుకుంటే, ఆయన వచ్చే ఏడాది వెంకటేష్ కి ఎఫ్ 3 ఉంటుంది అన్నారు. ఇప్పటివరకు తరుణ భాస్కర్ మూవీపై క్లారిటీ ఇవ్వలేదు. దీనితో తరుణ్ భాస్కర్ కి షాక్ తగిలినట్టు అయ్యింది. ఇక వెంకటేష్ విషయానికి వస్తే మంచి కథలతో సినిమాలు చేస్తూ మంచి హిట్స్ సాధిస్తూ సీనియర్ హీరోస్ వెంకటేష్ మంచి ఫామ్ లో వున్నాడు. ఎఫ్ 2 వెంకీ మామ సూపర్ హిట్స్ తర్వాత ప్రస్తుతం నారప్ప సినిమా చేస్తున్నాడు కరోనా వైరస్ వ్యాప్తి వాళ్ళ షూటింగ్ ఆగిపోయింది. ఈ సినిమా తమిళ బ్లాక్ బస్టర్ అసురన్ సినిమా కి రీమేక్ కాగా, అడ్డాల శ్రీకాంత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.













