తారక్, త్రివిక్రమ్ సినిమా ఆగిపోవడానికి అంత బలమైన కారణమేంటి?
ఆర్ఆర్ఆర్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా చేయబోయే సినిమాను ఇప్పటికే ప్రకటించేశారు. కొరటాల శివ దర్శకత్వంలో పాన్ ఇండియన్ మూవీగా ఎన్టీఆర్30 తెరకెక్కనుందని అనౌన్స్ చేశారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధా ఆర్ట్స్ బ్యానర్లపై కళ్యాణ్ రామ్, మిక్కిలినేని సుధాకర్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
వాస్తవానికి ఎన్టీఆర్ 30 త్రివిక్రమ్ డైరక్షన్ లో చేయాల్సింది. అరవింద సమేత తర్వాత తారక్, త్రివిక్రమ్ కాంబోలో రానున్న సినిమాకు అయినను పోయి రావలె హస్తినకు అనే టైటిల్ కూడా ప్రచారంలోకి వచ్చింది. కానీ రెండేళ్ల తర్వాత అనూహ్యంగా ఈ మధ్యనే ఆ సినిమా క్యాన్సిల్ అయిందని అనౌన్స్ మెంట్ వచ్చింది.
ఆ తర్వాత కొరటాల శివ లైన్ లోకి రావడమే కాకుండా నెక్ట్స్ ప్రాజెక్ట్ గురించి అనౌన్స్ మెంట్ కూడా ఇచ్చేశాడు. త్రివిక్రమ్ సినిమా లేనందుకు ఫ్యాన్స్ నిరాశ చెందినప్పటికీ కొరటాలతో సినిమా చేస్తున్నందుకు హ్యాపీగా ఫీల్ అయ్యారు. అయితే అసలు తారక్, త్రివిక్రమ్ సినిమా ఆగిపోవడానికి రీజనేంటని అందరూ ఆలోచిస్తున్న టైమ్ లో ఇండస్ట్రీ వర్గాల్లో ఒక మాట వినిపిస్తుంది. ఈ ప్రాజెక్ట్ ఆగిపోవడానికి రీజన్ ఇప్పటికీ సినిమా కథ రెడీ అవకపోవడమే అని తెలుస్తుంది. ఎన్టీఆర్ కు కేవలం స్టోరీలైన్ మాత్రమే చెప్పి ఒప్పించిన గురూజీ, దాన్ని కథగా మలచలేదని, అంతేకాకుండా ప్రస్తుతం అయ్యప్పనుమ్ కోషీయుమ్ రీమేక్ పైనే త్రివిక్రమ్ ఫోకస్ అంతా ఉండటం వల్ల ఈ ప్రాజెక్ట్ ను క్యాన్సిల్ చేశారనే టాక్ బాగా వినిపిస్తుంది. కానీ నిజమైన కారణమేంటో తెలియనప్పటికీ ప్రొడ్యూసర్స్ ట్విట్టర్ లో ఎన్టీఆర్ ని అన్ ఫాలో చేయడాన్ని బట్టి చూస్తుంటే ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అవడానికి ఏదో బలమైన కారణమే ఉండి ఉంటుందని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.













