తమన్నా ప్లేస్లో తాప్సీ ?
థ్రిల్లర్ ఎంటర్టైనర్ గేమ్ ఓవర్ సెక్సెస్తో ఉత్సాహంతో వున్నారు తాప్పీ. తాజాగా ఆమె మరో థ్రిల్లర్ చిత్రానికి ఓకే చెప్పినట్లు తెలిసింది. బుల్లితెర వ్యాఖ్యాత ఓంకార్ రాజుగారి గది చిత్రానికి కొనసాగింపుగా రాజు గారి గది-3 చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తమన్నాను కీలక పాత్ర కోసం ఎంచుకున్నారు. ఈ చిత్రం ఇటీవలే మొదలైంది. అయితే అనివార్య కారణాల వల్ల తమన్నా ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ దశలోనే తప్పుకున్నారు. నవాజుద్దీన్ సిద్ధిఖీ నటిస్తున్న బోలే చూడియా అనే చిత్రాన్ని తమన్నా అంగీకరించారు. ఈ చిత్రానికి డేట్స్ సర్దుబాటు చేసుకున్న ఆమె డేట్స్ సమస్య కారణంగానే రాజు గారి గది-3 చిత్రం నుంచి తప్పుకున్నారని తెలిసింది. దాంతో ఆమె స్థానంలో కథనాయికగా తాప్సీని దర్శకుడు ఓంకార్ ఖరారు చేయనున్నట్లు చిత్ర వర్గాల సమాచారం. ఇటీవలే ఆమెను చిత్ర బృందం కలిసిందని, త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారని తెలిసింది.













