మన దేశంలో ఇది మరీ ఎక్కువ
పురుషాధిక్య సమాజంలో స్త్రీల పరిస్థితి అధ్వాన్నంగా ఉంటోందని అందాల తార తాప్సీ ఆవేదన వ్యక్తం చేసింది. మగవారికి దీటుగా మహిళలు రాణించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొంది. ప్రస్తుతం తాప్సీ బాలీవుడ్లో మంచి హిట్స్‌ను అందుకుంటోంది. ఇటీవల మిషన్ మంగళ్ చిత్రంలో సూపర్‌హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది ఈ బ్యూటీ. ప్రస్తుతం బాలీవుడ్‌నే నమ్ముకున్న తాప్సీ సౌత్‌పై పెద్దగా దృష్టి పెట్టడం లేదు. ఇక నేడు సమాజంలో మహిళల పరిస్థితి గురించి మాట్లాడుతూ ఏ దేశంలోనైనా పురుషాధిక్యత కనిపిస్తుంది. మనదేశంలోనైతే పురుషాధిక్యత మరీ ఎక్కువగా కనిపిస్తుంది. ఈ పరిస్థితుల్లో స్త్రీల జీవనం ఇబ్బందికరంగా మారుతోంది. నేడు సమాజంలో మగవారెవరూ మహిళలకు సాయం చేయరు. తమకు తామే స్త్రీలు సాయం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక నేను నటిగా పంజాబీ చిత్రాలతో పరిచయమైనా ఆ తర్వాత తమిళ్, తెలుగు భాషా చిత్రాలతో ప్రాచుర్యం పొందాను. ప్రస్తుతం హిందీలో హీరోయిన్గా మంచి పాపులారిటీని తెచ్చుకున్నా అని తాప్సీ పేర్కొంది.













