మిథాలీ బయోపిక్‌లో తాప్సీ
భారత మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మిథాలీరాజ్ బయోపిక్‌లో తాప్సి నటించనుందని కొద్దిరోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. మిథాలీ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు. మిథాలీ పాత్రలో తాప్సి నటించనున్న ఈ చిత్రానికి శభాష్ మిథు అనే పేరు ఖరారు చేశారు. షారుఖ్ ఖాన్‌తో రయీస్ తెరకెక్కించిన రాహుల్ ఢొలాకియా దర్శకత్వం వహించనున్నారు. వయాకామ్ 18 సంస్థ నిర్మించనుంది. జన్మదిన శుభాకాంక్షలు కెప్టెన్. తెరపై నీ పాత్రను చూసుకుని నువ్వు గర్వపడేలా చేస్తానని ఈ పుట్టినరోజున మాటిస్తున్నా అని ట్వీట్ చేసింది తాప్సి. దాంతోపాటు మిథాలీ రాజ్‌తో కలసి ఉన్న ఫొటోలను పంచుకుంది.













