Tanu Sri Datta: నా ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి
తెలుగు, తమిళ, హిందీ సినిమాల్లో ఒకప్పుడు హీరోయిన్ గా రాణించిన తను శ్రీ దత్తా(Tanu Sri Datta) 2004 లో ఫెమినా మిస్ ఇండియా యూనివర్స్ గా గెలిచిన సంగతి తెలిసిందే. తెలుగులో వీరభద్ర(Veera Bhadra) అనే సినిమా చేసిన తనుశ్రీ 2013 తర్వాత సినిమాలకు దూరమైంది. రీసెంట్ బాలీవుడ్ లో మీటూ ఉద్యమాన్ని మొదలుపెట్టిన ఆమె గత ఆరేళ్లుగా తన సొంతింట్లోనే వేధింపులకు గురువుతున్నానని ఆవేదన వ్యక్తం చేస్తూ వార్తల్లో నిలిచింది.
ఆ వీడియో బయటికొచ్చినప్పటి నుంచి ఆమెకెంతో మంది ఫోన్ చేస్తున్నారని, గత కొన్నేళ్లుగా తాను ఆధ్మాత్మిక జీవనశైలికి అలవాటు పడ్డానని, అందుకే ఎక్కువగా మీడియా ముందుకు రావడం లేదని తెలిపారు. హెల్త్ బాలేకపోయినా కొన్నాళ్ల నుంచి వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నానని, అందరితో మాట్లాడటానికి తనకు కాస్త టైమ్ పడుతుందని, తనను ప్రశాంతంగా ఉండనీమయని తనుశ్రీ కోరింది.
అయితే రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె బాలీవుడ్ లో మాఫియా ముఠా చాలా పెద్దదని, తన ప్రాణానికి ప్రమాదముందని, సుశాంత్ సింగ్ రాజ్పుత్(susanth signh rajput) లానే తన ప్రాణం కూడా ప్రమాదంలో ఉందని, అతనిలానే తనను కూడా చంపడానికి ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పడంతో ఆమె చేసిన కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్ గా మారాయి.













