తనుశ్రీ మరో బాంబ్ పేల్చింది!
లైంగిక వేధింపులు, కాస్టింగ్ కౌచ్‌పై తనుశ్రీ దత్తా వరుస బాంబులు పేలుస్తోంది. గతంలో ఎదుర్కొన్న పరిస్థితులను బహిర్గతం చేస్తున్న ఆమెకు, తోటి ఆర్టిస్టుల నుంచి మద్దతు దొరుకుతోంది. ప్రముఖ నటుడు నానా పటేకర్, డ్యాన్స్ మాస్టర్ గణేశ్ ఆచార్య తనను లైంగికంగా వేధించారని హీరోయిన్ తనుశ్రీ దత్తా మరో మాంబు పేల్చింది. దాదాపు పదేళ్ల క్రితం హారన్ ఓకే ప్లీజ్ సెట్లో తనను నానా పటేకర్ వేధించాడన్నది ఆమె ఇంతకు మందు బాంబు పేల్చింది. తాజాగా వివేక్ అగ్నిహోత్రిపై మరో బాంబు వేసింది. బాలీవుడ్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి ఓ సినిమా షూటింగ్ సమయంలో అమర్యాదకరంగా ప్రవర్తించాడని బయటపెట్టింది. లైంగికంగా వేధించాడన్నది ఆమె అభియోగం. చాకొలెట్, డీప్ డార్క్ సీక్రెట్ కోసం ఓ పాట షూటింగ్ సమయంలో దుస్తులు విప్పి నృత్యం చేయాలంటూ వేధించాడని ఆవేదన వ్యక్తం చేసింది. అక్కడేవున్న సునీల్‌శెట్టి, ఇర్ఫాన్ఖాన్ల సహయంతో ఆ పరిస్థితి నుంచి తాను బయటపడ్డానని చెప్పుకొచ్చింది. బాలీవుడ్ బండారాన్ని బయటపెడుతున్న తనుశ్రీకి పర్హాన్ అక్తర్, ప్రియాంక చోప్రా, రిచా చడ్దా, ట్వింకిల్ ఖన్నాలు మద్దుతుగా నిలుస్తున్నారు.













