మళ్లీ వస్తున్నా తనుశ్రీదత్తా
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మీటూ మూమెంట్‌కు మూలబిందువు అయిన తనుశ్రీదత్తా మళ్లీ సినిమాల్లో నటించేందుకు ఆసక్తి చూపుతోంది. బాలీవుడ్ నటుడు నానా పటేకర్‌పై తనుశ్రీ చేసిన ఆరోపణలు సంచలనం సృష్టించాయి. పైగా మిగతా రంగాలన్నింటికీ వ్యాప్తించి.. ఆమె పేరు మారుమ్రోగేలా చేశాయి. తనుశ్రీ చివరిగా అపార్ట్మెంట్ అనే సినిమాలో నటించింది. ఇది విడుదలై పదేళ్లు దాటుతోంది. మీటూ మూమెంట్‌తో యమ పాపులర్ అయిన తనుశ్రీ ఆ పాపులారిటీని క్యాష్ చేసుకునేందుకు మళ్లీ సినిమాల్లోకి వస్తోంది. అయితే ఆమెను సాదరంగా ఆహ్వానించేది ఎవరో వేచి చూడాల్సిందే.













