తండ్రి కూతుర్లను అవమాన పరిచావ్…. కబడ్ధార్ రామ్ గోపాల్ వర్మ!
ఏది ఏమైనా మర్డర్ చేస్తా అని మొండిగా మర్డర్ సినిమా పూర్తి చేసాడు దానికి సంభందించిన ట్రైలర్ కూడా విడుదల చేసాడు ఆర్జీవీ. కుటుంబ కథా చిత్రం అంటూ సినిమాలో వున్నా ముఖ్యమైన సన్నివేశాల్లో షాట్స్ చూపిస్తూ… క్యాప్షన్స్ గుప్పిస్తూ విడుదల చేసిన ట్రైలెర్ కి మంచి స్పందన లబించింది అయితే కమ్యూనిటీ పరంగా విమర్శలు వచ్చాయి. నిజ జీవితంలో మారుతీరావు సాధుజీవి అని ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు టంగుటూరి రామకృష్ణ గుర్తు చేసుకున్నారు. అలాంటి వ్యక్తి పాత్రతో మద్యం సేవిస్తున్నట్లు చూపించటం బాధాకరమని అన్నారు. మిర్యాలగూడలో సంచలనం రేపిన ఘటన అయిన అమృత, మారుతీరావులపై ‘మర్డర్’ సినిమా తెరకెక్కించడం రామ్‌గోపాల్‌వర్మ శాడిజానికి నిదర్శనమని ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు టంగుటూరి రామకృష్ణ వ్యాఖ్యానించారు. ఈ మేరకు మంగళవారం హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు.
జరిగిపోయిన ఘటనకు సంబంధించి ఇద్దరు వ్యక్తులు, రెండు కుటుంబాలు వారి సామాజిక వర్గాన్ని రోడ్డుకు ఈడ్చడం హేయమైన చర్య అని ధ్వజమెత్తారు. మర్డర్ సినిమాపై మా అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోకపోతే రామ్ గోపాల్ వర్మ తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.నిజ జీవితంలో మారుతీరావు సాధుజీవి అని రామకృష్ణ గుర్తు చేసుకున్నారు. అలాంటి వ్యక్తి పాత్రతో మద్యం సేవిస్తున్నట్లు చూపించటం బాధాకరమని అన్నారు. అమృత, తండ్రి మారుతీరావు ఇద్దరినీ విలన్లుగా చూపించడం వర్మ పబ్లిసిటీ పిచ్చికి పరాకాష్ఠ అని విమర్శించారు. ఒకరు ప్రేమించి తప్పు చేశారని, మరొకరు హత్య చేయించడం ద్వారా తప్పు చేశారంటూ ఇద్దరినీ విలన్లుగా సృష్టించారని తప్పుబట్టారు. మర్డర్ సినిమా ద్వారా రెండు కుటుంబాలను వర్మ బజారున పడేస్తున్నారని మండిపడ్డారు. తమ డిమాండ్‌కు వర్మ తలొగ్గకపోతే చట్టపరమైన చర్యలు తప్పవని టంగుటూరి రామకృష్ణ హెచ్చరించారు.













