మారనున్న తండేల్, రాబిన్ హుడ్ రిలీజ్ డేట్లు
మెగా ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్న గేమ్ ఛేంజర్ రిలీజ్ విషయం లో ఓ క్లారిటీ వచ్చేసింది. ఈ సినిమా క్రిస్మస్ కానుకగా రిలీజ్ కానుందని నిర్మాత దిల్ రాజు స్వయంగా వెల్లడించాడు. ఇదే దిల్ రాజు గతంలో ఈ సినిమాను సెప్టెంబర్ రిలీజ్ అని చెప్పాడు కానీ చెప్పిన మాటను నిలబెట్టుకోలేకపోయాడు. ఇప్పుడు మళ్లీ క్రిస్మస్ అని కొత్త హామీ ఇస్తున్నాడు.
దీంతో ఈ సారైనా దిల్ రాజు మాటను నమ్మొచ్చా అని ఫ్యాన్స్ సందేహపడుతున్నారు. ఎన్ని సందేహాలున్నా ప్రస్తుతం దిల్ రాజు మాటలను నమ్మడం తప్పించి మరో ఆప్షన్ లేదు. దానికి కారణం గేమ్ ఛేంజర్ ఒకవేళ క్రిస్మస్ సీజన్ ను మిస్ అయితే దానికున్న మరో ఆప్షన్ సంక్రాంతి. కానీ సంక్రాంతికి చిరంజీవి విశ్వంభర ఇప్పటికే ఫిక్స్ అయి ఉంది.
కాబట్టి గేమ్ ఛేంజర్ సంక్రాంతికి వచ్చే ఛాన్స్ లేదు. కాబట్టి సమ్మర్ తప్ప మరో ఆప్షన్ లేదు. అందుకే గేమ్ ఛేంజర్ క్రిస్మస్ కు రావడం ఖాయమని అందరూ నమ్ముతున్నారు. ఒకవేళ గేమ్ ఛేంజర్ క్రిస్మస్ కు రిలీజైతే ముందుగా షెడ్యూల్ అయిన తండేల్, రాబిన్ హుడ్ సినిమాలు రేసు నుంచి తప్పుకోక మానదు. కంటెంట్ మీద నమ్మకముందని రిలీజ్ చేసినా థియేటర్ల సమస్య కచ్ఛితంగా ఉంటుంది. కాబట్టి తండేల్, రాబిన్ హుడ్ రిలీజ్ డేట్లు మారే ఛాన్సులు పుష్కలంగా ఉన్నాయి. తండేల్ ను సమ్మర్ కు వాయిదా పడొచ్చని ఇప్పటికే ప్రచారం మొదలైంది. ఇక రాబిన్ హుడ్ సినిమాను ముందుగా రిలీజ్ చేయడమో లేదంటే ఫిబ్రవరికి పోస్ట్‌పోన్ చేయడమో చేస్తారు.













