తమ్మారెడ్డి భరద్వాజకు మాతృ వియోగం
దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ తల్లి కృష్ణవేణి (94) కన్నుమూశారు. గత రెండు నెలలుగా తన తల్లి అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారని భరద్వాజ తెలిపారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా తనను పరామర్శించడానికి ఎవరూ ఇంటికి రావద్దని ఆయన కోరారు. కృష్ణ వేణి భర్త కృష్ణమూర్తి నిర్మాతగా లక్షాధికారి, •మీందారు, బంగారు గాజులుతో పాటు పలు విజయవంతమైన చిత్రాల్ని నిర్మించారు. వామపక్ష భావజాలమున్న కుటుంబం వీరిది. తమ్మారెడ్డి భరద్వాజను సీనియర్ హీరో చిరంజీవి పరామర్శించారు. సినిమా ఒక మజిలీ, సమ సమాజం తమ అంతిమ లక్ష్యమనే ఆలోచనతో కృష్ణమూర్తి కుటుంబం తెలుగు సినిమా పరిశ్రమకు ఇతోధిక సేవలందించిందని చిరంజీవి అన్నారు.













