అప్పుడు అంతలా కమర్షియల్ గా వున్నా సోను సూద్…. ఇప్పుడు ఇంతలా మారిపోయాడేంటని ఆశ్చర్య పోతున్నా : తమ్మారెడ్డి భరద్వాజ

సోనూ సూద్ చాలా కమర్షియల్ అనుకున్నా అంటూ ఒకానొక సందర్భంలో ఎదుర్కొన్న ఓ విషయాన్ని బయటపెట్టారు తమ్మారెడ్డి భరద్వాజ. ఆయన చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. కరోనా కష్ట కాలంలో సోనూసూద్ పేరు మారుమోగుతోంది. గతేడాది లాక్‌డౌన్ సమయంలో సహాయం చేయడానికి స్వయంగా ముందుకొచ్చి రోజురోజుకూ తన సహాయ కార్యక్రమాలను విస్తృతం చేస్తూ ఎందరికో సాయం అందించి రియల్ హీరో అనిపించుకున్నారు సోనూ. దేశ వ్యాప్తంగా అవసరమైన ప్రతి ఒక్కరికీ ఆయన తరఫున సాయం అందుతుండటంతో భారీ క్రేజ్ ఏర్పడింది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు అన్ని రాష్ట్రాల్లో ఆయన్ను దేవుడిగా చూస్తున్నారు ప్రజలు. ఈ నేపథ్యంలో సోనూపై సీనియర్ దర్శకనిర్మాత ప్రస్తుతం సోనూ సూద్ ప్రభుత్వాలు కూడా చేయలేని గొప్ప పనులు చేస్తూ ప్రజా మెప్పు పొందుతున్నారు. అవసరమైన వారికి ఆక్సిజన్ అందిస్తూ ప్రాణదాత అవుతున్నారు. అయితే ఆయన గురించి మాట్లాడే అర్హత కూడా మనకు లేదంటూనే.. నాలుగైదేళ్ళ క్రితం జరిగిన ఓ సంఘటన గురించి తమ్మారెడ్డి ప్రస్తావించడం హాట్ టాపిక్ అయింది. ఒకానొక సమయంలో సోనూసూద్ చాలా కమర్షియల్‌గా వ్యవహరించేవాడని తమ్మారెడ్డి పేర్కొన్నారు.
నాలుగు సంవత్సరాల క్రితం వికలాంగుల ఛారిటీ కోసం ఒక కార్యక్రమం నిర్వహిస్తున్నాం రమ్మని అడిగితే ఆ సమయంలో డబ్బులు ఇస్తే వస్తానన్నాడని అన్నాడంటూ బాంబు పేల్చారు తమ్మారెడ్డి. అది చూసి సోనూ ఇంత కమర్షియల్‌గా ఆలోచిస్తారా అనుకున్నా కానీ నేడు సోనూసూద్ అందరికీ దేవుడిలా మారాడని అన్నారు. తెలుగు, తమిళ, హిందీ భాషా చిత్రాల్లో విలన్‌గా నటించి ఫేమస్ అయిన సోనూ సూద్ రియల్ లైఫ్‌లో మాత్రం హీరో అయ్యారు. కష్టకాలంలో సోనూ చేస్తున్న సేవా కార్యక్రమాల పట్ల పలువురి ప్రశంసలు దక్కుతున్నాయి.