అమెరికాకు సూపర్ స్టార్ !
సూపర్ స్టార్ రజనీకాంత్ ఆరు పదుల వయస్సులోనూ కుర్ర హీరోలతో సమానంగా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. తలైవా ప్రధాన పాత్రలో తెరకెక్కిన 2.0 చిత్రం నవంబర్ 29న విడుదలై పెద్ద విజయం సాధించింది. ఇక కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో రజనీకాంత్ పేటా అనే చిత్రం చేయగా, ఈ మూవీని సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తున్నారు. ఇటీవల ఈ చిత్ర టీజర్ విడుదల కాగా ఇందులో రజనీకాంత్ స్టిల్స్ ప్రేక్షకులకి అమితానందాన్ని కలిగిస్తున్నాయి. త్వరలో మురుగదాస్‌తో కలిసి క్రేజీ ప్రాజెక్ట్ చేయనున్నాడు. ఆ ప్రాజెక్ట్‌కి ముందు రజనీకాంత్ కొద్ది రోజులు అమెరికాకి వెళ్ళాలని భావించగా, నేడు కుటుంబ సభ్యులతో కలిసి అక్కడికి పయనం కానున్నారని టాక్. జనవరి మొదటి వారంలో తిరిగి చెన్నైకి రానున్నట్టు సమాచారం. హెల్త్ చెకప్ కోసం రజనీకాంత్ యూఎస్ వెళుతున్నట్టు తెలుస్తుంది. గతంలోనూ చెకప్ కోసం తలైవర్ పలుమార్లు అమెరికాకి వెళ్ళిన సంగతి తెలిసిందే.













